Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anti Khamenei Protests Violent In Iran 2

Iran: పూర్తిగా అదుపుతప్పిన ఇరాన్.. అగ్నికీలల్లో వాహనాలు, ఆస్తులు

Published Date :January 10, 2026 , 7:25 am
By Suresh Maddala
  • పూర్తిగా అదుపుతప్పిన ఇరాన్
  • దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు
  • ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • అగ్నికీలల్లో వాహనాలు, ఆస్తులు
Iran: పూర్తిగా అదుపుతప్పిన ఇరాన్.. అగ్నికీలల్లో వాహనాలు, ఆస్తులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌లో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గత రెండు వారాల నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇంతలో ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి కూడా భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన మద్దతుదారులు, ప్రభుత్వ వ్యతిరేకులంతా రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. వాహనాలు తగలబెట్టడం.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో రణరంగంగా మారింది. నిరసనకారులను కంట్రోల్ చేయలేక భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినట్లుగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Tourist Family : ఆస్కార్ రేసులో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’.. గర్వపడుతున్న సౌత్ సినిమా!

Also Read

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
  • Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
  • Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రస్తుతం ఇరాన్ అంతటా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో నాల్గో అతి పెద్ద నగరమైన కరాజ్ నగర్‌లో కూడా నిరసనలు ఉధృతం అయ్యాయి. పలు వాహనాలు మంటలు కాలిపోయాయి. ఇంకోవైపు స్టార్‌లింక్, జీపీఎస్ సిగ్నల్స్ పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో పాటు పలు నగరాలు అంధకారం అలుముకుంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఖమేనీ వార్నింగ్..

ఇక ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను తీవ్రంగా హెచ్చరించారు. చరిత్రలో నిరంకుశులు, అహంకార పాలకులు అత్యున్నత స్థాయిలో పతనమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో వాషింగ్టన్ అశాంతిని సృష్టించిందని ఖమేనీ ఆరోపించారు. ఒకటే చెప్పదలుచుకున్నా.. అహంకారంతో పాలించే నాయకులు తప్పనిసరిగా పతనాన్ని ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చారు. ఫారో, నిమ్రోద్, మొహమ్మద్ రెజా (పహ్లవి) వంటి నిరంకుశులు, అహంకార పాలకులు, ఇతర పాలకులు తమ అహంకారంతో శిఖరాగ్రంలో ఉన్నప్పుడు పతనాన్ని చూశారని తెలుసుకోవాలని సూచించారు.

ట్రంప్ హెచ్చరికలు..
ఇరాన్‌లో నిరసనలు ప్రారంభం అయ్యాక ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ వరుస బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అధికారులు నిరసనకారులపై సైనిక శక్తిని ప్రయోగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా చెడు చేస్తే మేము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు.

నిరసనలకు కారణం ఇదే..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడుగా అణు కార్యక్రమంతో ముడిపడి ఉన్న అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. గత జూన్‌లో ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంతో సహా ప్రాంతీయ ఉద్రిక్తతలతో ఆ ఒత్తిడి మరింత తీవ్రమయ్యాయి. దీంతో రాష్ట్ర వనరులన్నీ హరించుకుపోయాయి.

ఇక ఇటీవల కాలంలో ఇరానీ కరెన్సీ భారీగా పడిపోయింది. 2025లో అమెరికా డాలర్‌తో పోలిస్తే దాని విలువు దాదాపు సగానికి పడిపోయింది. అధికారిక గణాంకాలు ప్రకారం డిసెంబర్‌లోనే ద్రవ్యోల్బణం 42 శాతానికి మించిపోయింది. ముఖ్యంగా విదేశీ దిగుమతులపై ఆధారపడిన వ్యాపారాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు పెరుగుతున్న ధరలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆర్థిక సంక్షోభంతో కుటుంబాలు విలవిలాడుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. తొలుత వ్యాపారులు నిరసనలకు దిగగా.. అనంతరం నెమ్మది నెమ్మదిగా విశ్వవిద్యాలయాలు… నగరాలకు నిరసనలు వ్యాప్తి చెంది తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు చేదాటిపోయాయి.

A video from Iran International shows intense scenes tonight at the central square of Saadat Abad, Tehran.

Coordinates: around 35.781684, 51.374576 pic.twitter.com/szj72GZVyp

— Faytuks Network (@FaytuksNetwork) January 10, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayatollah khamenei
  • Iran
  • Khamenei protests
  • trump
  • Violent Iran

తాజావార్తలు

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

  • Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!

  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions