ఇరాన్‌లో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గత రెండు వారాల నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఊహించినట్టుగానే ఇరాన్ మంటల్లో తగలబడుతోంది. గత కొద్దిరోజులగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు తాజాగా తీవ్ర రూపం దాల్చాయి. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు రోడ్లపైకి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.