Canada: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడి కేసులో మరో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడి కేసులో మరో భారతీయ సంతతి వ్యక్తిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోలోని ప్రధాన విమానాశ్రయం నుంచి 36 ఏళ్ల వ్యక్తిని పోలసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన తర్వాత, ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఏప్రిల్ 17, 2023న ఎయిర్ కార్గో కంటైనర్ తీసుకెళ్తున్న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారాన్ని, విదేశీ కరెన్సీని దోపిడి చేశారు. వీటిని సురక్షితమైన ఫెసిలిటీ నుంచి నకిలీ పేపర్లు ఉపయోగించి దోపిడీకి పాల్పడ్డారు.
స్విట్జర్లాండ్ జూరిచ్ నుంచి టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ వచ్చాయి. ఫ్లైట్ ల్యాండ్ అయిన కొద్ది సేపటికి కార్గోని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత దీనిని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. అయితే, ఒక రోజు తర్వాత అవి కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
Read Also: Rahul Gandhi : నేడు రాయ్ బరేలీలో రాహుల్ ప్రచారం.. ఇందిరా నుంచి సోనియా వరకు వ్యూహం ఇదే
మే 6, 2024లో ఈ కేసులో అర్చిత్ గ్రోవర్‌ని అధికారులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడానికి కెనడా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇతడిపై దొంగతనం, ఇతర అభియోగాలను మోపారు. గత నెలలో ఈ కేసులు అంటారియోకు చెందిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు పర్మ్పాల్ సిద్ధు(54), అమిత్ జలోటా(40), అమ్మద్ చౌదరి(43), అలీ రజా(37), ప్రసాత్ పరమలింగం(35) లను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దొంగతనం జరిగిన సమయంలో ఎయిర్ కెనడా ఉద్యోగి, బ్రాంప్టన్‌కి చెందిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్(31), మిస్సాసాగాకు చెందిన 42 ఏళ్ల అర్సాలాన్ చౌదరి కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్లు జారీ చేశారు. వీరిలో ఒకరు పోలీసులకు చిక్కగా, మరొకరిపై వారెంట్ జారీ చేసింది. ఈ ఇద్దరు మాజీ ఎయిర్ కెనడా ఉద్యోగులు దొంగతనంలో సాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగిలించిన సరుకులో 400 కిలోల బరువున్న స్వచ్ఛమైన 6600 బంగారం కడ్డీలు ఉన్నాయి. వీటి విలువ 20 మిలియన్ కెనడియన్ డాలర్లు. 2.5 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ ఉంది.
తాజావార్తలు
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్‌లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!