అమెరికా-భారతదేశం మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: TBJP Chief :తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్.. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించారు. దీంతో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం ఏప్రిల్ 2న సుంకాలను మూడు నెలల పాటు వాయిదా వేస్తు్న్నట్లు ప్రకటించారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తోంది. ఈ గడువు పొడిగించే అవకాశం లేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక భారత్-అమెరికా మధ్య వాణిజ్యంపై కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను జూలై 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: Samantha : మధ్యాహ్నం కూర్చుంటే.. సాయంత్రం అయిపోతుంది.. సమంత కామెంట్స్ వైరల్
అదనపు సుంకాల నుంచి భారత్ మినహాయింపు కోరుతోంది. వస్త్రాలు, రొయ్యలు, రత్నాలు, తోలుపై భారతదేశం ఉపశమనం కోరుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్, వ్యవసాయ వస్తువులపై కోతలు విధించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య చర్యలు సఫలీకృతం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం, ఆటోమొబైల్స్, పారిశ్రామిక వస్తువులు, శ్రమ-ఇంటెన్సివ్ ఉత్పత్తులు వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భారత్ నుంచి ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో బృందం వాషింగ్టన్‌తో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
