NTV Telugu Site icon

UN on Ukraine: రష్యాకు మద్దతుగా అమెరికా ఓటింగ్, భారత్ గైర్హాజరు.. యూఎన్‌లో సంచలనం..

Trump

Trump

UN on Ukraine: అమెరికా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రతీ దశలో కూడా ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలిచింది, అందుకు తగ్గట్లుగానే ఓటింగ్‌లో పాల్గొంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు చిరకాల ప్రత్యర్థిగా భావించే రష్యాతో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు.

Read Also: DK Aruna : దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు

సోమవారం ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్‌కి వ్యతిరేకంగా, రష్యాకు మద్దతుగా అమెరికా ఓటేసింది. రష్యా ఉక్రెయిన్ నుంచి వైదొలగాలని, యుద్ధాన్ని ఖండించాలనే యూఎన్ తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. మరోవైపు, అనేక యూరప్ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. భారత్ ఓటింగ్‌కి దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండిస్తూ, ఆక్రమిత భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని.. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్‌, ఉత్తర కొరియాతో పాటు మాస్కోతో అనుబంధం ఉన్న 14 దేశాలు ఖండించాయి. అయినప్పటికీ ఈ తీర్మానాన్ని యూఎస్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అనుకూలంగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. 65 మంది గైర్హాజరయ్యారు. భారత్‌తో పాటు అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా మరియు ఇరాన్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, యుద్ధాన్ని ఆపేయాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి.