Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ యూకేకి చెందిన ‘డైలీ టెలిగ్రాఫ్’ వార్తాపత్రిక కోసం రాసిన కాలంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు, తన భార్య ఏమైనా జరిగినా దానికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బాధ్యత వహించాలని అన్నారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ప్రభుత్వానికి ఇది నవ్వులాటగా మారిందని అన్నారు. పాక్ ఆర్మీ తనకు వ్యతిరేకంగా చేయగలిగిందంతా చేసిందని, తనను హత్య చేయడమే మిగిలి ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నా భార్య బుష్రా బీబీకి ఏదైనా జరిగిన పాక్ ఆర్మీదే బాధ్యత అని చెప్పారు. నేను దేనికి భయపడనని, బానిసత్వం కన్నా మరణాన్నే ఇష్టపడుతానని ఆయన అన్నారు. 75 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఎక్కువ కాలం మిలిటరీ పాలకుల పాలనలోనే ఉంది. ఆ దేశ రాజకీయాల్లో మిలిటరీది కీలక పాత్ర. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఆర్మీ కలుగజేసుకుంటుదని ఆరోపించారు.
Read Also: Amit Shah fake video case: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్..
1971తో తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) కోల్పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని ఖాన్ హెచ్చరించారు. బలూచిస్తాన్‌లో తీవ్రమవుతున్న తీవ్రవాదం, పరాయికరణ చూస్తోందని, పాకిస్తాన్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ లోపల హత్యలు చేసినట్లు భారత్ ఇప్పటికే అంగీకరించిందని, ఆఫ్ఘనిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు అస్థిరంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రాజకీయంగా తమ ఎన్నికల గెలుపును దొంగిలించారని, ఆర్థికంగా చితికిపోయినందుకు ప్రజలు కోపంతో ఉన్నారని, దేశం ఒంటరిగా ఉందని ఆయన రాశారు. ఫిబ్రవరి 8న తన మద్దతుదారులకు ఎక్కవ స్థానాలు వచ్చినప్పటికీ, సైన్యం మద్దతుతో ఆ ఆదేశాన్ని దొంగిలించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ ట్యాంపరింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టు ఆరుగురు న్యాయమూర్తులపై వేధింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు.
