US Mid Air Accident: విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. ప్రకటించిన యూఎస్..
- అమెరికా విమాన ప్రమాదంలో 67 మంది మృతి..
- గాలిలోనే ఢీకొన్న ఆర్మీ హెలికాప్టర్, విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Mid Air Accident: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్లు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ని గాలిలోనే ఢీకొట్టింది. దీంతో పెనుప్రమాదం చోటు చేసుకుంది. మిడ్ ఎయిర్‌లో విమానం-హెలికాప్టర్ ఢీకొని సమీపంలోని పోటోమాక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 28 మృతదేహాలనున వెలికితీశారు. హెలికాప్టర్‌లోని మొత్తం సిబ్బందితో పాటు విమానంలోని ప్రయాణికులు మొత్తం 67 మంది మరణించినట్లు సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు.
Read Also: S Jaishankar: డొనాల్డ్ ట్రంప్ ‘‘అమెరికన్ జాతీయవాది’’..
Also Read
- Trump-Pakistan: పాకిస్థాన్‌కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
- US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
తాము ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ నుంచి మృతదేహాల రికవరీ ఆపరేషన్‌కి మారుతున్న దశలో ఉన్నామని వాషింగ్టన్ అగ్నిమాపక అధికార జాన్ డొన్నెల్లీ విలేకరుల సమావేశంలో అన్నారు. ఎవరూ ప్రాణాలలతో బయటపడరని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మానవ తప్పిదమే అని తెలుస్తోంది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్టీఎస్బీ) ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది, హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వీరంతా మరణించారు. ఒక వేళ క్షతగాత్రులు ప్రాణాలతో ఉన్నా కూడా పోటోమాక్ నదిలో నీరు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఉండటం వల్ల 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం బతికే అవకాశం లేదు. దీంతో ప్రమాదంతో ముడిపడి ఉన్నవాళ్లంతా మరణించినట్లే.
https://twitter.com/PantherMike182/status/1884800051459047741
తాజావార్తలు
-
Sridhar Babu : హైదరాబాద్‌లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
-
Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
-
Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
-
West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!