US Mid Air Accident: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్లు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ని గాలిలోనే ఢీకొట్టింది.