US Mid Air Accident: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్లు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ని గాలిలోనే ఢీకొట్టింది. దీంతో పెనుప్రమాదం చోటు చేసుకుంది. మిడ్ ఎయిర్‌లో విమానం-హెలికాప్టర్ ఢీకొని సమీపంలోని పోటోమాక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 28 మృతదేహాలనున వెలికితీశారు. హెలికాప్టర్‌లోని మొత్తం సిబ్బందితో పాటు విమానంలోని ప్రయాణికులు మొత్తం 67 మంది మరణించినట్లు సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు.
Read Also: S Jaishankar: డొనాల్డ్ ట్రంప్ ‘‘అమెరికన్ జాతీయవాది’’..
తాము ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ నుంచి మృతదేహాల రికవరీ ఆపరేషన్‌కి మారుతున్న దశలో ఉన్నామని వాషింగ్టన్ అగ్నిమాపక అధికార జాన్ డొన్నెల్లీ విలేకరుల సమావేశంలో అన్నారు. ఎవరూ ప్రాణాలలతో బయటపడరని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మానవ తప్పిదమే అని తెలుస్తోంది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్టీఎస్బీ) ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది, హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వీరంతా మరణించారు. ఒక వేళ క్షతగాత్రులు ప్రాణాలతో ఉన్నా కూడా పోటోమాక్ నదిలో నీరు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఉండటం వల్ల 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం బతికే అవకాశం లేదు. దీంతో ప్రమాదంతో ముడిపడి ఉన్నవాళ్లంతా మరణించినట్లే.
https://twitter.com/PantherMike182/status/1884800051459047741
