Alcor Life Extension: చనిపోయిన వారిని మళ్లీ బతికించే సంస్థ.. ఎలాగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
alcor life extension foundation preserve dead bodies in the hope of reincarnation: మృతి చెందిన వారు మళ్లీ తిరిగిరారన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే, అంతిమ సంస్కారాలు చేసి, అక్కడితో వదిలేస్తాం. కానీ.. కొందరు మాత్రం చనిపోయిన తమ కుటుంబీకులు తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఒక సంస్థ చనిపోయిన వారి శరీరాలను భద్రపరుస్తోంది. మృతి చెందిన వారు బతికి రావడం అసాధ్యమైనా, దాన్ని సాధ్యం చేయాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ పేరు అల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్. ఇది అమెరికాలో ఉంది. చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారో, వారి మృతదేహాల్ని ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుస్తారు.
ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్ లైన్ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా వాళ్లు చెప్తున్నారు. చనిపోయిన వారిని లిక్విడ్ నైట్రోజన్‌తో నిండిన ఒక స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులో ఉంచుతారు. దీనిని క్రయో ప్రిజర్వ్ అంటారు. ఇందులో మృతదేహాలను మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు ఉంచుతారు. 2014లో మృతిచెందిన బిట్‌కాయిన్ మార్గదర్శకుడు హాల్ ఫిన్నీ శరీరాన్ని క్రయో ప్రిజర్వ్ చేశారు. అలాగే.. 2015లో బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతిచెందిన థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్‌ను ఉంచారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తమ పాపని కాపాడుకునేందుకు మెదడుకు ఎన్నో శస్త్రచికిత్సలు చేశారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, తమ పాపా ఏనాడైనా బతికొస్తుందన్న నమ్మకంతో.. ఈ ఫౌండేషన్‌ని సంప్రదించి, ఆ పాప మృతదేహాన్ని క్రయో ప్రెజర్వ్ చేశారు.
Also Read
- Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- 19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
ఇందులో మృతదేహాలను రక్షించేందుకు అల్కోర్ సంస్థ ఉపయోగించే ప్రక్రియను విట్రిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో వాళ్లు మొదటగా శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవాల్ని తొలగించి.. హానికరమైన మంచు స్పటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలతో భర్తీ చేస్తారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద ట్యాంకుల్లో ఉంచుతారు. ఇలా మృతదేహాల్ని భద్రపరుస్తున్నందుకు గాను వాళ్లు సుమారు రూ. 1 కోటి వరకు ఛార్జ్ చేస్తారు. ఇందులో ఇప్పటివరకూ 199 మంది మానవులను, 100 పెంపుడు జంతువుల్ని క్రయో ప్రిజర్స్ చేశారు. మరో 500 మంది తమ శరీరాలను క్రయో ప్రిజర్వ్ చేయడానికి తమ సంస్థను సంప్రదించినట్టు ఫౌండేషన్ అధికారులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!