Site icon NTV Telugu

Ind-Pak: ఎల్‌వోసీ వెంబడి మళ్లీ వెలసిన ఉగ్ర శిబిరాలు.. నిఘా వర్గాలు గుర్తింపు

Indpak

Indpak

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు. తాజాగా ఉగ్రవాదులంతా తిరిగి వస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ధ్వంసమైన ప్రాంతాల్లోనే తిరిగి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా శిబిరాలను పాకిస్థాన్ పునర్నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ సైన్యం, గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ప్రభుత్వం యొక్క పూర్తి మద్దతుతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా గుర్తించింది.

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. 13 మంది మావోలు లొంగుబాటు

నిఘా, దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎల్‌వోసీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో హైటెక్ ఉగ్రవాద సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి గ్రూపులు పరారయ్యాయి. తిరిగి అవే గ్రూప్‌లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. లూని, పుట్వాల్, టిప్పు పోస్ట్, జమిల్ పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్ ఫార్వర్డ్, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో శిబిరాలు వెలసినట్లుగా గుర్తించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో తిరిగి నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు కలిగి ఉంటాయి. డ్రోన్, క్షిపణి దాడుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులంతా ఈ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అయితే ఉగ్ర కార్యకలాపాలను నిలువరిస్తామని పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. తీరా ఇన్ని రోజులకు దాయాది దేశం తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. తిరిగి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేయిపిస్తోంది.

Exit mobile version