Imran khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఫుడ్ మెనూ విడుదల చేసిన ప్రభుత్వం
- ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు
- బయటకు వచ్చిన ఫుడ్ మెనూ
- ఆరోగ్యంగా ఉన్నారన్న అడియాలా జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని.. కంటి చూపును కూడా కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇంకో వైపు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని కాపాడాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వానికి 14 దేశాలకు చెందిన మాజీ కెప్టెన్లు లేఖలు రాశారు. ఇందులో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో ఉంటున్నారు.
ఫుడ్ మెనూ
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను వెల్లడించింది. దేశీ చికెన్, మటన్‌తో పాటు డ్రైఫ్రూట్స్ పెడుతున్నట్లుగా పేర్కొంది.
Also Read
అడియాలా జైలులోని ఏడు గదుల ప్రత్యేక జైలు సముదాయంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని.. సహజ వెలుతురుతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతోందని పేర్కొంది. అలాగే వ్యాయామం కోసం సైక్లింగ్ యంత్రాలు, జిమ్ పరికరాలు అందించినట్లు తెలిపింది. ఇక ఆహార, పానీయాల్లో ఖర్జూరాలు, వాల్నట్లు, చికెన్, మటన్, సలాడ్, వేయించిన గుడ్లు, వివిధ ఫ్రూట్ షేక్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Rajya sabha: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణలో ఎన్నంటే..!
ఎండలో కూర్చుని పుస్తకాలు, వార్తాపత్రికలు చదువుతున్నారని నివేదికలో పేర్కొంది. అల్పాహారంలో ఖర్జూరం, వాల్నట్లు, తేనె, కాఫీ, గంజి, లస్సీ, వేడి పాలు, చియా గింజలు, దానిమ్మ రసం తీసుకుంటున్నారని తెలిపింది. మధ్యాహ్న భోజనంలో దేశీ చికెన్, మటన్, సలాడ్, మిశ్రమ ఊరగాయలు, బంగాళాదుంప చిప్స్, గుడ్లు, వివిధ రకాల పప్పులు ఉన్నాయని చెప్పింది. ఇక సాయంత్రం బాదం, ఎండుద్రాక్ష, తురిమిన కొబ్బరి, పాలు, ఖర్జూరం, అరటిపండ్లు, ఆపిల్ షేక్‌లను తీసుకుంటున్నారని వివరించింది.
ఇది కూడా చదవండి: Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!