London Girl: పిల్లల్లో చాలా మందికి ప్రయాణాలంటే ఇష్టంగా వెళతారు. స్కూల్ ఎగ్గొట్టి ప్రయాణాలు చేయాలని కూడా పిల్లలు ఆశపడుతుంటారు. ఇటు ప్రయాణాలను.. అటు స్కూల్‌ను రెండింటిని మిస్ కాకుండా 50 దేశాలు తిరిగిందో 10 ఏళ్ల బాలిక. ఇప్పటి వరకు తాను ఒక్క రోజు స్కూల్ మానేయకుండానే ఇన్ని దేశాలు చూసివచ్చినట్టు వారి తల్లిదండ్రులు, బాలిక చెబుతున్నారు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మరీ దేశాల పర్యటనకు వెళ్లి వస్తున్నారు. బాలిక 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి ఇలా దేశాలు పర్యటిస్తున్నారు. ఆ బాలిక భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం.
Read also: NTR: రక్తపాతం సృష్టిస్తున్న సముద్ర వీరుడు…
ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ పిల్లల స్కూళ్లు, ఉద్యోగాలు, అదనపు ఖర్చులు వంటి కారణాలతో చాలా మంది ఆగిపోతుంటారు. అయితే ఓ పదేళ్ల చిన్నారి ఇప్పటివరకు 50 దేశాలను సందర్శించింది. అదీ ఒక్క రోజు స్కూల్ మానేయకుండానే. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలు ఆ చిన్నారికి ఇన్ని దేశాలు తిరగడం ఎలా సాధ్యమైందో.. ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో చదవండి.. బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్ సంతతికి చెందిన అదితి త్రిపాఠి తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పటివరకు 50 దేశాలలో పర్యటించింది. ఐరోపాలోని చాలా దేశాలను సందర్శించింది. అదితి మూడేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తొలిసారి జర్మనీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. నేపాల్, భారత్, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది. త్వరలో ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుంది.
Read also: Cyber Fords: ఇన్వెస్ట్మెంట్ డబుల్ అన్నారు.. కట్ చేస్తే రూ.712 కోట్లు కొట్టేశారు
సౌత్ లండన్‌లో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రులు దీపక్ త్రిపాఠి, అవిలాష బ్యాంకులో అకౌంటెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదితికి చిన్న వయసులోనే వివిధ ప్రాంతాలను చూపించడం వల్ల సమాజంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ సంస్కృతి, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి తెలుసుకోగలుగుతుందని.. ఇది తాను జీవితంలో ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చిన్నారి తండ్రి దీపక్ తెలిపారు. ఏ దేశం వెళ్లాలో ముందుగానే అనుకుంటాం. అదితిని శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా పర్యటనకు తీసుకెళ్తాం. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకునే విధంగా ప్రణాళిక వేసుకుంటాం. ఒక్కోసారి పర్యటన నుంచి రావడం ఆలస్యమైతే ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్కూల్‌కి వెళ్లిపోతుంది. సందర్శన కోసం ఏడాదికి 20వేల పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.21 లక్షలు) ఖర్చు చేస్తాం. పర్యటనలో బయట ఆహరం తినడం తక్కువే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులోనే ప్రయాణిస్తాం. ఇంతవరకు మాకు సొంత కారు కూడా లేదు. అదితికి రెండేళ్ల చెల్లెలు ఉంది. తనకూ వీలైనన్ని ఎక్కువ దేశాలను చూపిస్తామని అదితి తల్లిదండ్రులు తెలిపారు. తాను ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగానని.. నేపాల్, జార్జియా, అర్మేనియా అంటే తనకెంతో ఇష్టమని.. అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతాలు చాలా ఉన్నాయని అదితి తెలిపింది. ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా చూశానని. గుర్రపు స్వారీ చేయడంతోపాటు ఎన్నో విషయాలను నేర్చుకున్నానని. పర్యటనల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అదితి తెలిపింది.