వామ్మో.. అక్షరాలా రూ.16 లక్షలను చెత్తలో పడేసిన వ్యాపారి.. ఎందుకో తెలిస్తే షాకే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బుకోసం ప్రతి ఒక్కరూ క్షణమ్ తీరికలేకుండా పనిచేస్తుంటారు. ఇక వ్యాపారులు అయితే సరేసరి.. వారికి తినడానికి కూడా సమయం ఉండదు. ఇక అలాంటి ఒక వ్యాపారి అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు.. ఆ పొరపాటు విలువ అక్షరాలా రూ. 16 లక్షలు. ఒక్క రూపాయి కిందపడితేనే ఎవరు చూడకుండా జేబులో వేసుకొనే జనల మధ్య ఏకంగా రూ. 16 లక్షలను చెత్తకుప్పలో వేస్తే.. ఊరుకుంటారా..? ఎంచక్కా డబ్బుతో పరారయ్యారు.. అసలు అక్కడ ఏం జరిగింది.. అంతగా వ్యాపారి చేసిన పొరపాటు ఏంటిది అనేది చూద్దాం.
గ్రీకు దేశంలో ఒక వ్యాపారి, కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడికి ఆ దేశంలో చాలా షాపులు ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ ఈయన చూసుకుంటుండగా.. మిగతా బ్రాంచ్ లు అతని భాగస్వాములు నడుపుతున్నారు. ఇక ఎప్పటిలానే షాపులో ఉన్న డబ్బును, ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొని షాపు ఓపెన్ చేయడానికి వ్యాపారి బయల్దేరాడు. షాపు త్వరగా ఓపెన్ చేయాలనే ఆత్రంతో డస్ట్‌బిన్‌లో చెత్త సంచీతోపాటు పొరపాటున మరో చేతిలో ఉన్న 19వేల యూరోలు(సుమారు రూ.16లక్షలు)గల బ్యాగును కూడా అందులో పడేశాడు. ఇంకేముంది షాపుకు వెళ్లి చూడగా డబ్బు కనిపించలేదు.
Also Read
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
- Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
వ్యాపారి తేరుకోని చెత్తకుప్ప దగ్గరకు వెళ్లి చూడగా డబ్బు సంచి కనిపించలేదు. అక్షరాలా రూ. 16 లక్షలు చేజారడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిచాడు. వారి సహాయంతో చెత్తను తీసుకెళ్లే వాహానాన్ని ట్రేస్ చేసి పట్టుకున్నాడు. అనంతరం అందులో వెతికాడు. అయినా అతనికి డబ్బు దొరకలేదు. గంట సేపు విశ్వ ప్రయత్నాలు చేసి, అన్ని చెత్త వాహనాలను వెతకగా ఎట్టకేలకు డబ్బు కంటపడింది. అప్పటివరకు ప్రాణాలను బిగబట్టుకున్న వ్యాపారికి ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.. అరెరే మేము వ్యాపారి వేసిన సంచులను చూసాం కానీ అందులో డబ్బు ఉందని గుర్తించలేకపోయామే అని స్థానికులు కూసింత కోపాన్ని చూపిస్తున్నారు.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?