NTV Telugu Site icon

China: కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

Firechina

Firechina

చైనాలోని కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.

చైనాలోని ఉత్తర ప్రావిన్స్ హెబీలోని కూరగాయల మార్కెట్‌లో శనివారం ఉదయం 8:40 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది… సంఘటనా స్థలానికి చేరుకుని గంటకు పైగా మంటలను ఆర్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఇక గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రభుత్వం తెలిపింది.

అగ్నిప్రమాదంలో మార్కెట్‌లోని వస్తువులన్నీ కాలిపోయాయి. పండ్లు, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ మార్కెట్ 2011లో ప్రారంభించబడింది. ఇక్కడ కూరగాయాలు ఎక్కువగా విక్రయిస్తుంటారు.

Show comments