Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- ఆరేళ్లకే ప్రపంచ రికార్డు
- రూబిక్స్ క్యూబ్‌ను క్షణాల్లో సాల్వ్ చేసిన చైనా బాలిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rubik’s Cube World Record: రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించాలంటే పెద్దవాళ్లకే చాలా సమయం పడుతుంది. అలాంటిది చైనాకు చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి కేవలం కొన్ని సెకన్లలోనే 3×3 రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. తన అసాధారణ వేగంతో స్పీడ్‌క్యూబింగ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెంగ్డుకు చెందిన లియాన్ యున్‌జీ అనే ఈ చిన్నారిని కుటుంబ సభ్యులు ముద్దుగా ‘జిజి’ అని పిలుస్తారు. మహిళల 3×3 విభాగంలో అత్యంత వేగంగా రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసిన రికార్డును ఆమె నెలకొల్పింది.
4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ పూర్తి
చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ CCTV ప్రకారం.. లియాన్ ఈ నెలలో వుహాన్, గ్వాంగ్జౌ నగరాల్లో జరిగిన వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ గుర్తింపు పొందిన రెండు పోటీల్లో పాల్గొంది. ఈ రెండు పోటీల్లోనూ ఆమె మహిళల 3×3 సగటు రికార్డును బద్దలు కొట్టింది. ఒక పోటీలో 4.52 సెకన్ల సగటు సమయాన్ని నమోదు చేసిన లియాన్.. మరో పోటీలో కేవలం 4.27 సెకన్ల సగటు సమయంతో క్యూబ్‌ను పరిష్కరించింది. దీంతో 3×3 రూబిక్స్ క్యూబ్‌లో 4.5 సెకన్ల కంటే తక్కువ సగటు సమయాన్ని నమోదు చేసిన తొలి మహిళా స్పీడ్క్యూబర్గా ఆమె నిలిచినట్లు CCTV వెల్లడించింది.
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
వీడియోలో అదరగొట్టిన చిన్నారి
లియాన్ రూబిక్స్ క్యూబ్‌ను వేగంగా తిప్పుతున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు హెయిర్బో ధరించిన ఆమె.. క్యూబ్‌ను క్షణాల్లో సాల్వ్ చేసి టేబుల్‌పై ఉంచుతుంది. అనంతరం చప్పట్లు కొడుతూ, ఆనందంతో చేతిని పైకి ఎత్తుతుంది.
రోజూ 2 నుంచి 3 గంటల ప్రాక్టీస్
లియాన్ తల్లి లిన్ యాంగ్షీ మాట్లాడుతూ.. చిన్నతనంలో ఓ క్లాస్ సందర్భంగా తన కుమార్తెకు తొలిసారి రూబిక్స్ క్యూబ్ పరిచయమైందని చెప్పారు. ఆ సమయంలో లియాన్ డ్యాన్స్, మ్యూజిక్ వంటి ఇతర కార్యకలాపాలను కూడా నేర్చుకునేది. అయితే రూబిక్స్ క్యూబ్ పిల్లలలో పలు సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని ఆమె తల్లి గుర్తించారు. దీంతో లియాన్ దీనిపై మరింత ఆసక్తి పెంచుకుని సాధన చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం లియాన్ 1,300కు పైగా రూబిక్స్ క్యూబ్ అల్గారిథమ్‌లను నేర్చుకున్నట్లు సమాచారం. ప్రతిరోజూ సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఆమె ప్రాక్టీస్ చేస్తోంది.
కేవలం వేగం మాత్రమే కాదు.. లాజికల్ థింకింగ్ కూడా
రూబిక్స్ క్యూబ్ కేవలం వేగంగా పరిష్కరించే పజిల్ కాదని లియాన్ తల్లి చెబుతున్నారు. దీన్ని సాల్వ్ చేయడం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన, ఒక సమస్యను వివిధ కోణాల్లో చూడగల సామర్థ్యం పెరగవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాకుండా.. సరైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తార్కికంగా ఆలోచించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
ఆరేళ్ల వయసులోనే ఎన్నో ట్రోఫీలు
లియాన్ ఇంట్లో ఆమె సాధించిన విజయాలకు సంబంధించిన ఎన్నో ట్రోఫీలు ఉన్నాయి. కేవలం ఆరేళ్ల వయసులోనే రూబిక్స్ క్యూబ్‌లో ఇలాంటి అసాధారణ ప్రతిభ చూపడంతో ఆమె కథ చైనా మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Six-year-old Lian Yunzhi broke the women's 3×3 Rubik's Cube world record twice in three days at WCA-certified events in China — averaging 4.52s, then 4.27s. First woman ever to average under 4.5 seconds. She's mastered 1,300+ algorithms, training 2-3 hours daily.#RubiksCube pic.twitter.com/0x45cfr7ph
— Xavier Mareca (@xavierdatatech) September 22, 2026
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!