Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 51 Dead In Spain Valencia Region Due To Flash Floods

Spain Floods: స్పెయిన్‌లో వరద బీభత్సం.. 62 మంది మృతి

Published Date :October 30, 2024 , 4:25 pm
By Suresh Maddala
Spain Floods: స్పెయిన్‌లో వరద బీభత్సం.. 62 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 62 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదు అని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

S1

స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. హఠాత్తుగా వచ్చిన వరదలతో జనజీవనం అస్తవ్యస్థం అయింది. పలు కుటుంబాల్లో ఆప్తులను కోల్పోయి దు:ఖంలో ఉన్నారు. చాలా మంది వరదలో కొట్టుకుపోయారు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారని ప్రభుత్వ అధికారి కార్లోస్‌ మజోన్‌ పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ప్రజలు ఎవర్ని సీఎంగా కోరుకుంటున్నారు..?

వాలెన్సియా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలు కూడా నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్ని చోట్ల వరదలు ముంచెత్తడంతో రోడ్లు తెగిపోయాయని ప్రాంతీయ చీఫ్ కార్లోస్ మజోన్ విలేకరులతో అన్నారు. మొత్తానికి ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర వాతావరణ సంస్థ వాలెన్సియా ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో సిటీ హాల్‌ అన్ని పాఠశాల తరగతులు, క్రీడా కార్యక్రమాలను నిలిపివేసినట్లు వెల్లడించింది. 12 విమానాలను దారి మళ్లించగా.. 10 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ సంతాపం వ్యక్తం చేశారు. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఏపీ సీఎంతో నీతి ఆయోగ్‌ సీఈఓ భేటీ.. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై కీలక చర్చ

 

https://twitter.com/Trend_War_Newss/status/1851381562392395877

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • climate change
  • Firefighters
  • Floods
  • Heavy Rain
  • Mediterranean sea

తాజావార్తలు

  • OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

  • OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం

  • Kadiri YSRCP Politics: కదిరి వైసీపీలో మూడు రెక్కలాట.. బాషా, మక్బూల్, పూల మధ్య గేమ్‌!

  • Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

  • Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions