Earthquake: బంగ్లాదేశ్, కోల్‌కతాలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
- బంగ్లాదేశ్, కోల్‌కతాలో భూకంపం
- భయంతో ప్రజలు పరుగులు
బంగ్లాదేశ్, కోల్‌కతాను భూప్రకంపనలు హడలెత్తించాయి. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదైంది. బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డి నుంచి 14 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక బంగ్లాదేశ్‌లో భవనాలు కూలి ఆరుగురు చనిపోయారు.
ఇది కూడా చదవండి: Al-Falah University: ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్
బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత శుక్రవారం ఉదయం కోల్‌కతా, తూర్పు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.08 గంటలకు బంగ్లాదేశ్‌లోని నర్సింగ్‌డికి పశ్చిమ-నైరుతి దిశలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఇక కోల్‌కతా, పరిసర ప్రాంతాల నివాసులకు స్వల్ప భూప్రకంపనలు సంభవించినట్లుగా తెలిపారు. ఫ్యాన్లు, గోడలు ఊగడం చూసినట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇక భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగస్థులు కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. అమోమయం.. గందరగోళానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్ బెహార్‌లతో సహా ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లుగా అధికారులు తెలిపారు.
ఇక గురువారం పాకిస్థాన్‌లో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది.
Strong tremors felt across parts of Kolkata, including the Salt Lake IT sector.
Employees evacuated buildings as precaution.
No major damage reported yet, but authorities urge people to stay alert and avoid using elevators.
Stay safe, Kolkata. 🌍⚠️#Earthquake #Kolkata #SaltLake pic.twitter.com/ZDQm6087wu— Dr Tapas Pramanick (R G Kar Medical College) (@Rgkar2019Tapas) November 21, 2025
Earthquake of 5.2 magnitude at Kolkata#Earthquake #Kolkata #Westbengal pic.twitter.com/QLNZCKETOx
— Dr Dilshad (Dentist) (@DilshadShakil) November 21, 2025
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!