గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 26 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.