Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష.. ఏం చేసిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిక్షలు ఎవరికి వేస్తారు..? నేరాలకు పాల్పడిన మనుషులకి! అవే నేరాలు (మనుషులపై దాడి చేయడం) జంతువులు చేస్తే.. వాటి జోలికి ఎందుకెళ్ళారంటూ రివర్స్‌లో మన మీదే ఎగబడతారు. నోరు లేని మూగజీవుల్ని కెలికినందుకు.. తగిన శాస్తే జరిగిందంటూ శాపనార్ధాలు పెడతారు కూడా! కానీ, ఆఫ్రికా దేశంలో మాత్రం భిన్నంగా ఓ గొర్రెకు శిక్ష వేశారు. ఓ మనిషిని చంపిన నేరంలో.. మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ సూడాన్‌లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై రామ్ అనే ఒక గొర్రె దాడి చేసింది. తప్పించుకోవడానికి ఆ మహిళ ఎంత ప్రయత్నించినా, ఆ గొర్రె వదల్లేదు. వెంటపడి మరీ విచక్షణారహితంగా ఆమెపై విరుచుకుపడింది. దీంతో, తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ మరణించింది. రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ గొర్రెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. కస్టమరీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కూడా! ఈ గొర్రె వల్ల ఇతరులకూ ప్రమాదం ఉండొచ్చన్న ఉద్దేశంతో.. కోర్టు దానికి మూడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. శిక్షలో భాగంగా ఆ గొర్రె లేక్స్ స్టేట్‌లోని సైనిక శిబిరంలో గడుపుతుంది.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
అంతేకాదండోయ్.. ఆ గొర్ర యజమాని అయిన డుయోని మాన్యాంగ్‌కు కూడా కోర్టు జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం.. ఏదైనా జంతువు దాడిలో ఓ వ్యక్తి చనిపోతే, శిక్షా కాలం ముగిసిన తర్వాత దాన్ని బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు. అంతే, మూడేళ్ళ జైలు శిక్ష అనుభవించాక, ఆ గొర్రెని బాధిత కుటుంబానికి ఇచ్చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు