ఇక్కడ కనిపిస్తున్న చిన్నారిని చూశారా. ముద్దులొలికే ఈ పాప దుబాయ్ లో జరగనున్న వరల్డ్ ఫ్యాషన్ షోలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఎంపికైంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మూడేళ్ళ ఈ చిన్నారిది కేరళలోని కొట్టాయం జిల్లా. ఈ అమ్మాయి పేరు సెరా రాథీస్. ఈమెది కేరళలోని కొల్లాయం ఉమయనల్లూర్. అతి చిన్నవయసులో ముద్దులొలుకుతూ భారత తరఫున అంతర్జాతీయ వేదికలపై మెరవడానికి రెడీ అయింది.
ఇటీవల ఈ చిన్నారి నేషనల్ మోడల్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. అనంతరం అంతర్జాతీయంగా జరిగే ఫ్యాషన్ షోలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది. సెరా తండ్ంరి ఆర్‌ఎల్‌వీ రాథీస్ జేమ్స్ ప్రముఖ డ్యాన్సర్, కొరియో గ్రాఫర్. సెరా తన తల్లిదండ్రులతో పాటు దుబాయ్ వెళ్ళి అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో పాల్గొనుంది. నవంబర్ 23న దుబాయ్ వెళ్లనుంది. దుబాయ్‌లో నవంబర్ 24న ఫ్యాషన్ షో జరగనుంది. 20 దేశాలకు చెందిన 60 మంది చిన్నారులు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొననున్నారు. తనకు లభించిన అవకాశం గురించి సెరా తెగ హ్యాపీగా ఫీలవుతోంది.