US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. యూఎస్ టెక్సాస్ ఘటన మరువక ముందే.. పశ్చిమ మేరీ ల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని యూఎస్ మీడియా వెల్లడించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్స్‌బర్గ్‌లో కొలంబియా మెషీన్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు వాషింగ్టన్ సిటీ పోలీసులు తెలిపారు.
Pakistan: హిందూ ఆలయం ధ్వంసం.. భారత్ నిరసన
Also Read
కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాగా.. గత కొన్ని రోజులుగా అమెరికాలో హింస పెరుగుతూ వస్తోంది. న్యూయార్క్, టెక్సాస్, ఓక్లహోమాలో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో మరణించారు. టెక్సాస్ ఘటనలో 22 మంది మరణించారు. కాగా.. తుపాకీ హింసను నియంత్రించేందుకు.. చట్టాలను మరింత కఠినం చేసేలా జోబైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుపాకుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది.
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..