26 dead 85 injured As Two Trains Collide In Greece: గ్రీస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న కార్గో రైలుని ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 26 మంది దుర్మరణం చెందగా.. 85 మందికి పైగా గాయాలపాలయ్యారు. గ్రీస్‌లోని టెంపేలో చోటు చేసుకున్న ఈ క్రాష్‌లో.. కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పగా, మూడు కోచ్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనపై థెస్సాలీ గవర్నర్ కాన్‌స్టాంటినోస్ అగోరాస్తోస్ మాట్లాడుతూ.. రెండు రైళ్లు ఒకదానికొకరు స్ట్రాంగ్‌గా ఢీకొన్నాయని, ఈ ఘటనలో ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని, ముందు భాగంలో ఉండే రెండు కోచ్‌లు దాదాపు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ప్యాసింజర్స్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 250 మందిని సురక్షితంగా కాపాడగలిగామని అగోరాస్తోస్ పేర్కొన్నారు.
Tomato Price: ఆకాశాన్నంటిన టమోటా ధర.. పిజ్జాపై భారీ ఎఫెక్ట్
మరోవైపు.. అగ్నిమాపక సిబ్బందికి చెందిన వాసిలిస్ వార్తకోయియానిస్ మాట్లాడుతూ, తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రెండు రైళ్లు ఢీకొనడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు. దట్టమైన పొగలోనూ చూసేందుకు వీలుగా రెస్క్యూయర్స్ ‘సీథ్రూ’ దుస్తుల్ని ధరించారని, శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో 150 మంది ఫైర్ ఫైటర్స్, 17 వాహనాలు, 40 ఆంబులెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. శిథిలాలను తొలగించేందుకు క్రేన్‌లను తెప్పించి, రైలు కోచ్‌లను పైకి లేపనున్నట్లు గవర్నర్ అగోరాస్తోస్ వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని సంప్రదించినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. కాగా.. ప్యాసింజర్ రైలు థెస్సాలోనికి నుంచి లారిస్సాకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
Student Sathvik: కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్మ.. ఆ టార్చరే కారణం