Heat Wave: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాతావారణ కాలుష్యం వెరిసి భూమి సగటు ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దీంతో హిమనీనదాలు కరుగుతున్నాయి. కొన్నేళ్లలో అంటార్కిటికాలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, దీంతో తీర ప్రాంతాల్లోని నగరాలకు ముప్పు ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కన్నా 2 డిగ్రీ సెల్సియస్ పెరిగే, ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్ లోని సింధూలోయలో నివసించే దాదాపుగా 220 కోట్ల ప్రజలను వేడి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పీర్ రివ్యూడ్ జర్నల్ లో ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(పీఎన్ఏఎస్) పరిశోధన వెల్లడించింది. ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, చైనా, సబ్-సహారా ఆఫ్రికాలు ప్రధానంగా అధిక తేమతో కూడిన వేడి గాలులకు ప్రభావితం అవుతాయని తెలిపింది.
అధిక తేమ కలిగిన హీట్ వేవ్స్ చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే గాలి అధిక తేమను గ్రహించగలదు. ఈ పరిమితి మానవ శరీరం చమటలు త్వరగా ఆవిరయ్యే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత చమట త్వరగా ఆవిరి కాకపోవడంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండదు. పరిశోధనలో చెప్పబడిన ప్రాంతాలు తక్కువ-మధ్య ఆదాయ దేశాలు కావడంతో ఏసీలు లేదా ఉష్ణోగ్రతలు తగ్గించే పరికరాలను వాడే స్థోమత ఉండకపోవడ పోవచ్చని పరిశోధకులు తెలిపారు.
Read Also: Israel-Hamas War: హమాస్ కీలక కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్.. మిగతా వారికి ఇదే గతని వార్నింగ్..
సాధారణంగా మానవులు తేమ, వేడి కలయికను కొంతవరకు మాత్రమే భరించగలడు. ఈ పరిమితిని దాటినప్పుడు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. వడదెబ్బ, గుండెపోటు వంటి వాటికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. భూమి యెక్క ప్రపంచ ఉపరిత ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారిశ్రామిక విప్లవం తరువాత అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేశాయి.
2015లో 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవం పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్(ఐపీసీసీ) ప్రకారం.. ఈ శతాబ్ధం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపుగా 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు దారి తీయచ్చని అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే 2019 స్థాయిలతో పోలిస్తే, 2030లో ఉద్గారాలను సగానికి తగ్గించాలని ఐపీసీసీ చెప్పింది. తాజాగా పరిశోధనలు చేసిన బృందం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే ఏలాంటి ప్రభావం ఉంటుందని పరిశోధనలు