Hamas-Israel war: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. చిన్నారుల సహా 16 మంది మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడి
- చిన్నారుల సహా 16 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత తొమ్మిది నెలలుగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ప్రతీకారంగా ఆరోజు నుంచి ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా చిన్నారుల సహా 16 మంది చనిపోయారని గాజా వైద్యులు సోమవారం తెలిపారు. ఖాన్ యూనిస్ సమీపంలో ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్, వైమానిక దాడుల్లో కనీసం 16 మంది పాలస్తీనియన్లు మరణించారని డాక్టర్లు పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారని, దాడిలో డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ కొన్ని పరిసరాలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. ఆ ప్రాంతాలపై తిరిగి దాడులు కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
తమను ఎవరు ఖాళీ చేయమని చెప్పలేదని ఖాన్ యూనిస్ వాసులు వాపోయారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాకుండానే ఖాన్ యూనిస్‌పై దాడులు జరిగాయని ప్రజలు పేర్కొన్నారు. తాము ఇక అలసిపోయామని జనాలు వాపోయారు. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగానే పిల్లలతో కలిసి గాడిద బండ్లపై, మరికొందరు కాలినడకన వస్తువులు తీసుకుని పారిపోయారు. ఇక ఈ బాధలు భరించలేమని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Loan App harassment: లోన్‌యాప్ వేధింపులు.. సచివాలయం ఉద్యోగి అదృశ్యం..
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!