Pakistan: క్వెట్టా బ్లాస్ట్.. 14 మంది సైనికులతో సహా 26 మంది మృతి.. “బీఎల్ఏ” బాధ్యత..
- పాకిస్తాన్ క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు..
- 14 మంది పాక్ ఆర్మీ సైనికులతో సహా 26 మంది మృతి..
- బాధ్యత ప్రకటించుకున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని రైల్వే స్టేషన్‌లో బాంబు పేలి 26 మంది మరణించారు. పాకిస్తాన్ ఆర్మీ సైనికులే లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన 26 మందిలో 14 మంది సైనికులు ఉన్నారు. క్వెట్టా స్టేషన్ నుంచి పెషావర్‌కి ఈ రోజు ఉదయం రైలు బయలుదేరే ముందు ఈ పేలుడు సంభవించింది. పేలుకు సంబంధించిన వీడియోలో, ఫోటోలు వైరల్‌గా మారాయి.
Read Also: Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
అయితే, ఈ పేలుడు తమ పనే అని ‘‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)’’ ప్రకటించింది. పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు చెప్పింది. క్వెట్టా రైల్వే స్టేషన్‌లోని పాకిస్తాన్ ఆర్మీ యూనిట్‌పై దాడి చేసినట్లు ఒక ప్రకటనలో బీఎల్‌ఏ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఇటీవల కాలంలో ఈ సంస్థ పాక్ ఆర్మీతో పాటు, చైనీయులు లక్ష్యంగా దాడులు చేస్తోంది.
ముఖ్యంగా బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సుని కలుపుతూ సిపెక్ ప్రాజెక్ట్ చేపడుతోంది చైనా. ఈ ప్రాజెక్టులో పనిచేస్తే చైనీయులతో పాటు దానికి రక్షణగా నిలుస్తున్న పాక్ ఆర్మీ, పోలీసులపై బీఎల్ఏ విరుచుకుపడుతోంది. తమ బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు చైనా సహజ వనరుల్ని కొల్లగొడుతోందని బీఎల్ఏ ప్రధాన ఆరోపణ.
తాజావార్తలు
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!