Madagascar: ఎంతో ఆనందంతో ఆటల పోటీలను చూడటానికి వచ్చిన వారు అనంతలోకాలకు వెళ్లారు. స్టేడియంలో వెళ్లే క్రమంలో గేటు దగ్గర జరిగిన తొక్కిసలాటలో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ద్వీప దేశమైన మడగాస్కర్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మడగాస్కర్ దేశ రాజధాని అంటననారివోలో క్రీడల పోటీల సందర్భంగా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారని.. సుమారు 80 మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని క్రిస్టియన్ ఎన్ట్సే తెలిపారు.
Read Also: OG Teaser: అర్జున్ దాస్ వాయిస్ ఓవర్… సుజిత్ స్టైలిష్ టేకింగ్… పవన్ స్క్రీన్ ప్రెజెన్స్
11వ ‘ఇండియన్ ఓసియన్ క్రీడల’ పోటీలను అంటననారివోలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో స్టేడియం ముఖద్వారం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. రెడ్‌క్రాస్ మరియు స్థానిక పార్లమెంటు సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చిన్నారులతో సహా కనీసం 13 మంది మరణించారని తెలిపారు. మరణించిన వారిలో 7 మంది మైనర్లు ఉన్నారని చెప్పారు. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు దాదాపు 50,000 మంది ప్రేక్షకులు చేరుకున్న బరియా స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. విషాదానికి కారణం వెంటనే తెలియరాలేదని.. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెడ్‌క్రాస్ తెలిపింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకరికొకరు తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తెలిపారు. గత 40 ఏళ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోటీలను ఈసారి ఈ మడగాస్కర్‌లో నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు హాజరైన మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా ప్రమాదంలో మరణించిన వారికి ఒక నిమిషం మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. హిందూ మహాసముద్ర ద్వీపం గేమ్స్ మడగాస్కర్‌లో సెప్టెంబర్ 3 వరకు నిర్వహించబడుతున్నాయి. నైరుతి హిందూ మహాసముద్రంలోని వివిధ ద్వీపాలలో సుమారు 40 సంవత్సరాలుగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడా పోటీలు నిర్వహింబడుతున్నాయి. గతంలో ఇవి మారిషస్‌లో జరిగాయి.