ప్రజంట్ హీరో జయం రవి ఇంటి గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముందు నుంచి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ కి జయం రవి కి మధ్య రిలేషన్ ఉన్నట్లు రూమర్స్ నడుస్తున్నప్పటికి. రీసెంట్‌గా ఓ పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరవడంతో మరోసారి కోలీవుడ్ లో పుకార్లు మరింత పుంజుకున్నాయి. ఈ ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవ్వడంతో ఇది చూసిన జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది. ‘మాకు చట్టరిత్య ఇంకా విడాకులు అవ్వలేదు, విడాకులు వచ్చేవరకు నేను ఆర్తి రవి నే,18 సంవత్సరాలు నాతో కలిసి ఉన్న వ్యక్తి నన్ను ఇంట్లో నుండి గెంటేసి, పిల్లలను కూడా పట్టించుకోకుండా, వారి అవసరాలకు కావలసిన డబ్బు కూడా ఇవ్వడం లేదు’ అంటూ షాకింగ్ పోస్ట్ చేసింది. అయితే ఈ మాటలపై తాజాగా సింగర్ కెనీషా రివర్స్ పంచ్ ఇచ్చింది..
Also Read : Sri Vidya : స్నానానికి కూడా.. బిస్లరీ వాటర్ తెప్పించుకున్న హీరోయిన్
‘ఎవరికీ లొంగని ఒక మగాడు.. ఏ మహిళతో అయితే ఆనందం ఉంటుందో ఆ మహిళ దగ్గరే ఉంటాడు. ఆ మహిళకే మనసు ఇస్తాడు. మౌనంగా ఉంటున్నాను కదా అని నన్ను లైట్ తీసుకోకు.. నా మౌనమే నా బలం’ అంటూ ఆర్తి కి పరోక్షంగా కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చింది. దీంతో సింగర్ కెనీషా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంటే దీని అర్ధం ఆర్తి దగ్గర ప్రశాంతత లేకపోవడం వల్లే కెనిషాకి జయం రవి దగ్గరై ఆమెకు మనసిచ్చాడని పూర్తిగా అర్థమవుతుంది అంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు.