Iran: “హిజాబ్” ఉల్లంఘన.. సినిమాల్లో నటించకుండా 12 మందిపై నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతపాలనపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ చట్టాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా మహిళలు హిజాబ్ నియమాలను ఉల్లంఘిస్తే శిక్షలు దారుణంగా ఉంటాయి. తాజాగా హిజాబ్ చట్టాలను ఉల్లంఘించినందుకు దేశంలోని 12 మంది మహిళా నటులపై నిషేధాన్ని విధించింది అక్కడి ప్రభుత్వం. సినిమాల్లో నటించకుండా వీరందరిపై బ్యాన్ విధించింది.
Read Also: Patalkot Express: పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 కోచ్‌లు దగ్ధం..
Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
ఈ జాబితాలో ప్రముఖ నటులైన తరనేహ్ అలిదూస్తీ, కటాయోన్ రియాహి మరియు ఫతేమెహ్ మోటమెద్-అరియా వంటి వారు ఉన్నారు. చట్టాన్ని అనుసరించని వారు పనిచేయడానికి అనుమతింపబడరు అని ఇరాన్ కల్చర్, ఇస్లామిక్ గైడెన్స్ మినిస్టర్ మహ్మద్ మెహదీ ఎస్మాయిలీ క్యాబినెట్ సమావేశంలో మీడియా ముందు అన్నారు.
గతేడాది హిజాబ్ కారణంగా మోరాలిటీ పోలీసులు కొట్టడంతో 22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్స అమిని మరణించారు. ఈమె మరణం ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం పోసింది. ఈ ఆందోళనల్లో పాల్గొనందుకు అలిదూస్తి, రియహిని కొంతకాలం నిర్భందించారు. హిజాబ్ వ్యతిరేక ఉద్యమం సమయంలో మహిళలు తన హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు. ఇప్పటికీ కొంతమంది యువతులు హిజాబ్ ని పట్టించుకోవడం లేదు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత 1983 నుంచి మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానాలను కఠినతరం చేయడానికి అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం అనుకూలంగా ఓటేసింది.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!