ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తం అయింది. భారతీయులను అలర్ట్ చేసింది. తక్షణమే ఖాళీ చేయాలని సూచించింది. ఇందులో భాగంగా 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ అర్మేనియం చేరుకుంది. బుధవారం ఉదయం కల్లా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఇక సొంత వనరులు కలిగిన వారు కూడా తరలి వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Pooja Hegde : పాత పరిచయాలతో, మళ్లీ టై అప్ అవుతున్న పూజా హెగ్డే ?
ఇక అత్యవసర పరిస్థితుల్లో భారతీయ పౌరులందరూ వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా కోరింది. ఎలాంటి అవసరత వచ్చినా ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. +989010144557,+989128109115, +989128109109 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Retro : సూర్య ‘రెట్రో’ వెబ్ సిరీస్‌గా రానుందా..?
చైనా, టర్కీ, యూకే వంటి అనేక దేశాలు ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇక ఆదివారం టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య జరగాల్సిన అణు చర్చలు రద్దయ్యాయి.
ఇక జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధాంతరంగా.. ఆగమేఘాలపై అమెరికాకు వెళ్లిపోయారు. భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ , ఇరానియన్ సాయుధ దళాలు రెండింటికీ నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో షాద్మానీ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. ఖమేనీని చంపితేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ట్రంప్ అడ్డుపడడంతోనే ఖమేనీ బతికిపోయాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఖమేనీ బంకర్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
