Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ గేమ్స్ నుండి 10 మంది శ్రీలంక క్రడీకారులు అదృశ్యమయ్యారని అధికారులు ప్రకటించారు.. తొమ్మిది మంది శ్రీలంక అథ్లెట్లు మరియు మేనేజర్ తమ ఈవెంట్లను పూర్తి చేసిన తర్వాత అదృశ్యం కావడం కామన్తెల్త్ గేమ్స్‌లో కలకలం సృష్టిస్తోంది.. అయితే, సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కామన్వెల్త్ క్రీడల బృందంలోని పది మంది సభ్యులు బ్రిటన్‌లో ఉండేందుకు అనుమానాస్పద ప్రయత్నంలో అదృశ్యమయ్యారని ద్వీప దేశానికి చెందిన ఒక ఉన్నత క్రీడా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.. మొదట జూడోకా చమీలా దిలానీ, ఆమె మేనేజర్ అసేలా డి సిల్వా మరియు రెజ్లర్ షానిత్ చతురంగ గత వారం అదృశ్యమయ్యారు. దీంతో శ్రీలంక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారు.. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు 160 మందితో కూడిన శ్రీలంక క్రీడాకారుల బృందం బర్మింగ్‌హామ్ చేరుకోగా.. ఈవెంట్లు ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: IND vs WI: వెస్టిండీస్‌పై గ్రాండ్ విక్టరీ.. భారత్ ఖాతాలో మరో సిరీస్..
Also Read
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
ఇక, మొదట అదృశ్యమైన ముగ్గురిని బ్రిటీష్ పోలీసులు గుర్తించారు, అయితే వారు స్థానిక చట్టాలను ఉల్లంఘించినా.. ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే వీసాలను కలిగి ఉన్నందున, ఎటువంటి చర్య తీసుకోలేదని శ్రీలంక అధికారి వెల్లడించారు.. గతంలోనూ అంతర్జాతీయ ఈవెంట్ల నుంచి శ్రీలంక అథ్లెట్లు తప్పిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరులో, శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును విడిచిపెట్టి ఓస్లోలో ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ సందర్భంగా అదృశ్యమయ్యాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్ల ఆచూకీ లభించలేదు. ఇప్పుడు మరో 10 మంది తప్పిపోగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురుని గుర్తించగా.. మరో ఏడుగురి కోసం ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!