సెప్టెంబర్ 22 నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. ఈ నెల 22 నుంచి జీఎస్టీ పెరగనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పూర్తి వివారాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. సెప్టెంబర్ 22 నుంచి వస్తు సేవల పన్ను పెరగనుండడంతో ఫుడ్ డెలివరీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయ. ఇది స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్ ఫామ్ లపై ప్రభావం చూపుతుందని కొన్ని దిగ్గజ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త పన్నులతో జోమాటో ఆర్డర్ పై 2రూపాయల ఖర్చును పెంచవచ్చని.. దీనికంటే స్వీగ్గీకి ఎక్కువగా పెంచే అవకాశాలు ఉన్నాయని మోర్గాన్ స్టానీ విశ్లేషకులు వెల్లడించారు.