Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price: బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ముఖ్యంగా వెండి ధర కిలోకు రూ.4,400కు పైగా పడిపోయింది.. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత వెండి ధరలు భారీగా ఎగసిపడ్డాయి. మే 13న ఎంసీఎక్స్‌లో వెండి ధర కిలోకు రూ.3 లక్షలు దాటింది. అయితే ఆ తర్వాత వరుసగా ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా పతనంతో వెండి ధర రూ.3,00,238 నుంచి రూ.2,72,265కు పడిపోయింది. అంటే కేవలం 13 రోజుల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ.27,973 మేర తగ్గింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి జూలై 3 గడువు గల సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.2,76,716 వద్ద ముగిశాయి. కానీ మంగళవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ.4,451 మేర క్షీణించాయి. జనవరిలో వెండి ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ.4,57,328 వరకు చేరగా, ప్రస్తుతం ఆ గరిష్ట స్థాయి నుంచి రూ.1,85,063 మేర చౌకగా లభిస్తోంది.
వెండితో పాటు బంగారం ధర కూడా తగ్గింది. జూన్ 5 గడువు గల 24 క్యారెట్ల గోల్డ్ ఫ్యూచర్స్ ధర మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 గ్రాములకు రూ.1,59,081 నుంచి రూ.1,58,100కు పడిపోయింది. దీంతో బంగారం ధర తన గరిష్ట స్థాయి అయిన రూ.2,02,984 నుంచి దాదాపు రూ.44,884 మేర తగ్గింది. దిగుమతి సుంకం పెంపు తర్వాత మే 13న బంగారం ధర 10 గ్రాములకు రూ.1,62,186 వరకు చేరింది. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి బంగారం ధర రూ.4,086 మేర తగ్గింది.
Also Read
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Prices Fall: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంతంటే..?
మే నెల ప్రారంభం నుంచి చూస్తే మాత్రం బంగారం, వెండి ధరలు మొత్తం మీద పెరిగినట్టే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న వెండి ధర కిలోకు రూ.2,44,456గా ఉండగా, ప్రస్తుతం అది ఇంకా రూ.27 వేలకుపైగా అధికంగానే ఉంది. అదే సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,111 నుంచి సుమారు రూ.7 వేల మేర పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, దిగుమతి సుంకాల మార్పులు, అంతర్జాతీయ డిమాండ్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,58,890కి దిగి రాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. 1,45,650కి పరిమితమైంది. ఇక, గ్రామ్ వెండి ధర రూ.295 తగ్గడంతో కిలో వెండి ధర రూ.2,95,000కి చేరుకుంది..
తాజావార్తలు
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!