భారత్‌లో బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనేస్తుంటారు.. ఇక, పెళ్లిళ్లకైతే చెప్పాల్సిన పనేలేదు.. ధరలతో సంబంధం లేకుండా.. అవసరాన్ని బట్టి పెద్ద ఎత్తున బంగారం కొనుగుళ్లు సాగుతుంటాయి.. అయితే, గత రెండు రోజులగా పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి.. ఇవాళ్టి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు.. దీంతో.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Read Also:Train Speed Increases: ఇక రైలు బండి మరింత స్పీడ్‌గా..
ఇవాళ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,150గా ఉంది… ఇక, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ. 46,750గా, 24 క్యారెట్ల ధర రూ. 51,000గా ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ. 51,710 వద్ద కొనసాగుతోంది. ఇక, బెంగళూరు విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ. 51,050 దగ్గర ట్రేడింగ్‌లో ఉంది.. తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,750గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000 దగ్గర కొనసాగుతోంది.. మరోవైపు విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750 దగ్గర.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,000 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.. ఇక వెండి విషానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,400గా ఉండగా.. బెంగళూరు, కేరళ, విజయవాడ, విశాఖపట్నం లాంటి సిటీల్లోనూ అదే ధర నడుస్తోంది.