Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Fall: పసిడి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. ఈ రోజు పసిడితో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి.. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.1,400 తగ్గింది.. ఇటీవల కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, నవంబర్ 4వ తేదీ తర్వాత పసిడి ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.. ఇక, బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం కిలో వెండి ధర రూ.1,86,550గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే కిలో వెండిపై రూ.3 వేలకుపైగా తగ్గడం గమనార్హం.
మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,974 డాలర్లుగా ఉండగా, ఔన్సు వెండి ధర 51.48 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన బంగారం 10 గ్రాముల ధర రూ.1.38 లక్షలకు తగ్గింది. కిలో వెండి ధర రూ.1.82 లక్షల స్థాయికి దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ 19 నెలల గరిష్ఠానికి చేరడం బంగారం, వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి లావాదేవీలు ఎక్కువగా డాలర్లలోనే జరుగుతాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో ఈ లోహాలను కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీంతో అంతర్జాతీయంగా బంగారం, వెండికి డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిణామం స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
Also Read
- Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
- Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- 14K vs 18K vs 22K Gold: బంగారం స్వచ్ఛత ఎంత? 14K, 18K, 22K మధ్య తేడాలు ఇవే..
తాజావార్తలు
-
Kulgam Terror Attack: కుల్గామ్‌లో CRPFపై ఉగ్రదాడి.. కొత్త ఉగ్ర సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటన, RSSకు బెదిరింపులు
-
Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
-
Vu Masterpiece AEye TV: Vu కొత్త Smart TVలు లాంచ్.. 115 ఇంచెస్ స్క్రీన్, AI ఫీచర్లు, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్!
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
ట్రెండింగ్
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..