Astrology: మార్చి 18, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈరోజు ఈ రాశిలోని వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. విద్యార్థినులకు ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
వృషభం : ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆసక్తి అధికమవుతుంది. ప్రత్తి, పొగాకు, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివస్తుంది.
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఫలితాలు సామ్యాంగా ఉంటాయి. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారి బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య వివాదాలలు తలెత్తుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
సింహం : ఈ రోజు ఈ రాశివారికి ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. విజయాలు తేలికగా సొంతమవుతాయి. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెస్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
తుల : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. నిరుద్యోగులు ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడనుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులకు గురవుతారు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాక వల్ల గృహంలో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి అధికం. చిన్నతరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. తప్పనిసరి చెల్లింపుల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల యిబ్బందులు ఎదుర్కోక తప్పదు.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!