మేషం : ఈరోజు ఈ రాశిలోని వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. విద్యార్థినులకు ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వృషభం : ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి.…