Astrology: ఫిబ్రవరి 26, శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిది కాదు అని గమనించండి. మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃపారంభించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితాలు దక్కుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఆశయ సాధనకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు నిరుత్సాహం తప్పదు. రావలసిన ధనం అందటంతో ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికుల వల్ల సమస్యలు తప్పవు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. బంధుమిత్రుల నుండి అందిన ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. చిన్న చిన్న సమస్యలు లెదురైనా పరిష్కరించుకుంటారు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆడంబరాలకు, బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నారులు సమావేశాలు, వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు అసహనం, నిరుత్సాహం, ఏ విషయం పట్ల ఆసక్తి ఉండకపోవటం వంటి చికాకులు ఎదురవుతాయి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల జోక్యం అనివార్యమవుతుంది. ఖర్చులు అధికం కావడం, వృథా ధన వ్యయం వల్ల నిరుత్సాహం చెందుతారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. మిమ్ములను కొంతమంది ధన సహాయం అర్థిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళుతప్పవు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీనం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు పనులు, నగదు విషయంలో మెళుకువ అవసరం. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం