Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల ప్రాణాలు ఒక నాయకుడి రాజకీయ లెక్కల్లో భాగమైపోయిన క్షణం నుంచి… దేశ భద్రత, రాజకీయ ప్రయోజనం మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతుంది. చరిత్రను చూస్తే యుద్ధాలు సరిహద్దుల దగ్గర మొదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని యుద్ధాలు ఒక దేశ నాయకుడి టేబుల్ మీదకు వచ్చిన హెచ్చరికతోనే మొదలవుతాయి.
ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చుట్టూ తిరుగుతున్న ప్రశ్న అలాంటిదే. ‘Hostages: 843 Days of Abandonment’ పుస్తకం ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అక్టోబర్ 7 దాడి గురించి నెతన్యాహుకు ముందే తెలుసని ఈ పుస్తకం చెబుతోంది. ఇంతకీ అసలు ఆ పుస్తకంలో ఏం రాసి ఉంది. అది నెతన్యాహుకు ఎందుకు ఇబ్బందులు తెచ్చింది?
Also Read
- Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
- Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
- META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
అక్టోబర్ 7, 2023. హమాస్ ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు ఆ రోజు తర్వాత గాజా యుద్ధం మొదలైంది. వెస్ట్ ఏషియా మొత్తం మరోసారి అగ్నిగుండంగా మారింది.
ప్రపంచం ఈ దాడిని ఇజ్రాయెల్‌పై జరిగిన ఆకస్మిక దాడిగా చూసింది. ఇప్పుడు ఆ పుస్తకం ఆ కథలోని అత్యంత చీకటి భాగాన్ని బయటకు లాగుతోంది. హారెట్జ్ జర్నలిస్టులు ఎల్దార్, రూత్ యువాల్ రాసిన ఈ పుస్తకానికి సంబంధించిన కథనం ప్రకారం… అక్టోబర్ 7 దాడికి దాదాపు 10రోజుల ముందే నెతన్యాహుకు హమాస్ భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతోందన్న హెచ్చరిక చేరింది. పది రోజులు. ఒక దేశాన్ని అప్రమత్తం చేయడానికి పది రోజులు. సైన్యాన్ని సిద్ధం చేయడానికి పది రోజులు. సరిహద్దులను బలోపేతం చేయడానికి పది రోజులు. ప్రజలను రక్షించడానికి పది రోజులు. మరి ఆ పది రోజుల తర్వాత ఏం జరిగింది?
అక్టోబర్ 7 వచ్చింది. హమాస్ దాడి చేసింది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల ముందున్న ప్రశ్న చాలా సూటిగా ఉంది. నెతన్యాహుకు ముందే తెలిసి ఉంటే… ఆయన ఏం చేసినట్టు? ఆ పుస్తకం ప్రకారం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా నెతన్యాహుతో మాట్లాడారు. దాదాపు 45 నిమిషాల సంభాషణ. హమాస్ భారీ స్థాయిలో ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని హెచ్చరిక.
హమాస్ నాయకుడు యాహ్యా సిన్వర్ ఒక మాజీ పాలస్తీనా అధికారితో తాము సిద్ధం చేస్తున్న ఆపరేషన్ భూకంపంలా ఉంటుందని చెప్పినట్లు కూడా పుస్తకం చెబుతోంది. అంటే ప్రమాదానికి సంబంధించిన సంకేతాలు ఎక్కడో ఉన్నాయి. ఆ సంకేతాలు ప్రయాణించాయి. చివరికి నెతన్యాహు వరకు చేరాయని పుస్తకం చెబుతోంది. అక్కడి నుంచి కథలో అత్యంత అసౌకర్యమైన ప్రశ్న మొదలవుతుంది. ఆ సమాచారం నిజంగా ప్రధాని దగ్గరకు చేరితే… ఎందుకు దేశవ్యాప్తంగా అత్యవసర భద్రతా చర్యలు కనిపించలేదు? ఎందుకు సరిహద్దు రక్షణ మరింత బలపడలేదు? ఎందుకు సైనిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు? ఎందుకు ప్రజలకు ప్రమాద సంకేతం కనిపించలేదు? ఇంకా ముఖ్యంగా… ఎందుకు అక్టోబర్ 7 జరగాల్సి వచ్చింది?
ఇది నాయకత్వం గురించి ప్రశ్న. అధికారం గురించి ప్రశ్న. బాధ్యత గురించి ప్రశ్న. ఇక్కడే రాజకీయ కోణం కూడా మరింత పదునెక్కుతుంది. అక్టోబర్ 7కు ముందు నెతన్యాహు తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత యుద్ధం వచ్చింది.
యుద్ధంతో దేశ రాజకీయ దృష్టి మొత్తం భద్రత వైపు మళ్లింది. ప్రధాని పదవి చుట్టూ ఉన్న రాజకీయ సమీకరణాలు మారాయి. అందుకే విమర్శకులు ఇప్పుడు ఒక తీవ్రమైన ప్రశ్న అడుగుతున్నారు. ఈ యుద్ధం నెతన్యాహుకు రాజకీయంగా ఏదైనా ప్రయోజనం కలిగించిందా? ఆ ప్రశ్నకు ఇప్పటివరకు నిర్ధారిత సమాధానం లేదు. నెతన్యాహు ఉద్దేశపూర్వకంగా దాడిని జరగనిచ్చారనే ఆధారం కూడా బయటపడలేదు. అయితే ముందస్తు హెచ్చరిక నిజమని నిర్ధారణ అయితే… రాజకీయ ప్రయోజనం గురించి ప్రశ్న మరింత బలంగా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడి చేతిలోకి దేశాన్ని కాపాడగల సమాచారం వచ్చిందని తేలితే…ఆ సమాచారాన్ని ఆయన ఎలా ఉపయోగించారన్నది ప్రజలు తెలుసుకోవాలి. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పలేదు? నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం తీసుకోలేదు? ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఇదే సమాధానాలను కోరుతున్నారు.
స్వతంత్ర ప్రభుత్వ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా అందుకే పెరుగుతోంది. ఎందుకంటే అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి ఎంత భయంకరమో ప్రపంచానికి తెలుసు. కానీ ఆ దాడికి ముందు పది రోజుల్లో ఏం జరిగిందో ప్రపంచానికి ఇంకా పూర్తిగా తెలియదు. ఆ పది రోజుల్లో ఒక హెచ్చరిక నిజంగా నెతన్యాహు టేబుల్ మీద ఉందా? ఉంటే… ఆ టేబుల్ మీద నుంచి అది భద్రతా వ్యవస్థకు వెళ్లిందా? వెళ్లకపోతే ఎందుకు? అది వెళ్లి ఉంటే కూడా చర్య ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నలన్నీ ఒకే చోటికి వచ్చి ఆగుతున్నాయి.
నాయకత్వం ప్రజలను కాపాడటానికేనా? లేక అధికారాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఆ పుస్తకంలో లేదు. నెతన్యాహు దగ్గరే ఆ సమాధానం ఉండి తీరాలి. ఇంతకీ మీరేం అనుకుంటున్నారు? హమాస్ దాడి గురించి నెతన్యాహుకు ముందే తెలిసినా ఆయన కావాలనే ఈ అటాక్‌ని జరగనిచ్చారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!