Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి తెలివితేటలే.. మనిషి సర్వనాశనానికి కారణమైతే? మనం పీల్చే గాలి, తినే ఆహారమే మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తే? భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! సరిగ్గా ఇదే అంశంపై ప్రతిష్టాత్మక ‘ది లాన్సెట్’ జర్నల్ ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. రాబోయే 75 ఏళ్లలో.. అంటే 2100 నాటికి అణు యుద్ధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు మానవాళి మనుగడనే తుడిచిపెట్టేయగలవని ఈ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. మరి ఈ ముప్పుల వెనుక అసలు నిజాలేంటి? భవిష్యత్తు తరాలను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి..?
మనిషి తన మేధస్సుతో అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాడు. కానీ, ఇప్పుడు అదే టెక్నాలజీ వినాశకర రూపం దాల్చుతోంది. జర్మనీలోని బెర్లిన్ నగరంలో వరల్డ్ హెల్త్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో లాన్సెట్ ఓ నివేదిక ప్రవేశపెడుతోంది. ‘లాన్సెట్ కమిషన్ ఆన్ 21st సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్’ అనే ఈ నివేదిక ప్రకారం.. రాబోయే 75 ఏళ్లలో మానవాళిని భయపెట్టే 17 ప్రధాన ముప్పులను గుర్తించారు. 35 మంది నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి ఈ నివేదికను రూపొందించారు. మ్యానిపులేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణు యుద్ధాల వల్ల భూమిపై మానవజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఈ నివేదికలో హెచ్చరించారు.
ఈ నివేదికలోని అత్యంత భయానక అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం. ఏఐ సాయంతో తయారుచేసే బయోలాజికల్ వెపన్స్ కోట్లాది మంది ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టెక్నాలజీతో వైద్యం మెరుగుపడుతుందనుకుంటే, అదే టెక్నాలజీ రాక్షస రూపం దాల్చి మానవ మనుగడకే పెనుముప్పుగా మారుతుండటం ఆందోళనకరం. అణు యుద్ధాల వల్ల జరిగే నష్టం కూడా ఊహకందని విధంగా ఉంటుందని రిపోర్ట్ స్పష్టం చేసింది. అణు యుద్ధం జరిగితే వాతావరణంలోకి భారీగా దూసుకువచ్చే ధూళి కణాలు సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. దీనివల్ల పంటలు పండక, ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరవు ఏర్పడుతుంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది.
Also Read
కేవలం యుద్ధాలు, ఏఐ మాత్రమే కాకుండా.. మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీసే మరో 15 పెను ముప్పులను కూడా ఈ కమిషన్ పొందుపరిచింది. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, పిల్లల్లో పోషకాహార లోపం, సాంప్రదాయ యుద్ధాలు, అంతర్జాతీయ సహాయ నిధుల కోత, విపరీతమైన ఆల్కహాల్ వినియోగం, హై బ్లడ్ ప్రెజర్, ఆర్థిక అసమానతలు, విద్య లేమి, సహజ మహమ్మారులు, ఒబేసిటీ, మానసిక సమస్యలు, ధూమపానం, అనారోగ్యకరమైన వృద్ధాప్యం వంటివి ఇందులో ఉన్నాయి. వీటన్నింటి వల్ల మానవులు కోల్పోయే ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాలను శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఈ ముప్పుల తీవ్రతను అంచనా వేసేందుకు పరిశోధకులు డిసేబిలిటీ-అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ విధానాన్ని వాడారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాలను హరించే సామర్థ్యం ఉన్న వాటిని ప్రధాన వినాశకర ముప్పులుగా వర్గీకరించారు. ఉదాహరణకు.. గ్లోబల్ వార్మింగ్‌ను 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు పోనివ్వకుండా, 1.8 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేస్తే.. ఏకంగా 1.89 బిలియన్ల ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాలను కాపాడుకోవచ్చని నివేదిక తేల్చింది. ఇక అంతర్జాతీయ ఆరోగ్య నిధులు తగ్గిపోతే, 2100 నాటికి దాదాపు 1.5 బిలియన్ల ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇందులో దాదాపు 70 శాతం నష్టాలు సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతంలోనే జరుగుతాయని, అక్కడ ఇప్పటికే పోషకాహార లోపం ప్రధాన సమస్యగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది..
ఈ ఆరోగ్య ముప్పులు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ధనిక దేశాలలో స్థూలకాయం, మానసిక సమస్యలు ప్రధాన ఆందోళనకరంగా ఉంటే, పేద దేశాలలో విద్య లేమి, పోషకాహార లోపం ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. మూడేళ్ల క్రితం కేవలం సంఘర్షణలు, వాతావరణం, మహమ్మారులు అనే మూడు పెద్ద ముప్పులు మాత్రమే ఉంటాయని తాము భావించినట్లు వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ముర్రే వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆ జాబితా చాలా పెద్దదిగా మారిందన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తమై నిధులు కేటాయించాలని, ముందుచూపుతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కాలం ఎవరికోసమూ ఆగదు.. కానీ కాలం తెచ్చే ముప్పులను ముందే ఊహించి అప్రమత్తం కావడం మన చేతుల్లోనే ఉంది! ఇదీ లాన్సెట్ నివేదిక మన ముందుంచుతున్న అసలు సిసలైన హెచ్చరిక. మనం చేసే ప్రతి చిన్న పొరపాటు భావితరాల ప్రాణాల మీదకొస్తుంది.. అన్న మాటలు అక్షరసత్యాలు. ఐక్యతతో ముప్పులను ఎదుర్కొంటేనే.. ఈ భూమ్మీద మానవ జాతి చరిత్ర నిరంతరం కొనసాగుతుంది! లేదంటే.. చరిత్ర పుస్తకాలలో మాత్రమే మనిషి మిగిలిపోయే ప్రమాదం ఉంది!
:- CLN RAJU (Editor- NTV Digital)
తాజావార్తలు
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!