Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విప్లవాలు ఊరికే పుట్టవు. దశాబ్దాల అణచివేత, నిరంతర అవమానాలు, ప్రశ్నించే గొంతులపై దాడులు, స్వేచ్ఛను హరించే అధికారపు పెత్తనం లాంటి అంశాలు ప్రజల ఆగ్రహంగా మారతాయి. చరిత్రలో ఎన్నో విప్లవాల వెనుక ఇలాంటి బాధలే ఉన్నాయి. ఇరాన్ మహిళల స్వేచ్ఛా పోరాటం కూడా అలాంటి చరిత్రలో భాగమే. అయితే ఇన్ని ఉద్యమాలు, ఇన్ని నిరసనలు, ఇన్ని ప్రాణత్యాగాలు జరిగిన తర్వాత కూడా అక్కడి పాలకుల తీరు మారలేదని చెప్పడానికి గాయని పరస్తూ అహ్మదీకి విధించిన 74 కొరడా దెబ్బలే మరో ఉదాహరణ.
2024 డిసెంబర్లో పరస్తూ అహ్మదీ హిజాబ్ లేకుండా పురుష సంగీతకారులతో కలిసి ఒక సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఓ పాట పాడారు. ఆ సాంగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్‌ని ఇరాన్ అధికార వ్యవస్థ నేరంగా పరిగణించింది.
Also Read
ఇప్పుడు ఆమెకు 74 కొరడా దెబ్బలు అమలు చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు సంగీత బృంద సభ్యులకూ ఇదే శిక్ష విధించారు. రెండేళ్లపాటు సంగీత కార్యకలాపాలపై నిషేధం, ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. నిజానికి ఇలాంటి పరిస్థితికి పునాదులు 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఏర్పడ్డాయి. షా పాలనకు వ్యతిరేకంగా జరిగిన విప్లవం తర్వాత అయతొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. మతాధికారుల ఆధిపత్యంలో కొత్త పాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంది. మహిళల దుస్తులు, సామాజిక జీవితం, వ్యక్తిగత ప్రవర్తనపై మతపరమైన నియంత్రణలు మొదలయ్యాయి. తప్పనిసరి హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా మహిళలు అప్పుడే వీధుల్లోకి వచ్చారు.
1979 మార్చిలో వేలాది మంది మహిళలు నిరసనలు చేపట్టారు. అయినా 1983 నాటికి హిజాబ్ తప్పనిసరి నిబంధన చట్టబద్ధమైంది. ఆ తర్వాత కూడా మహిళల ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది. 2022లో మహ్సా అమినీ అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణపై మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కస్టడీలో ఆమె మరణించడంతో ఇరాన్ అంతటా నిరసనలు చెలరేగాయి. మహిళలు జుట్టు కత్తిరించుకున్నారు. హిజాబ్‌లను తగలబెట్టారు. మహిళ, జీవితం, స్వేచ్ఛ అనే నినాదంతో వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వ అణచివేతకు ఎదురొడ్డి నిలబడ్డారు. అరెస్టులు, హింస, ప్రాణనష్టంతో ఆ ఉద్యమం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ మహిళల స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న మాత్రం అక్కడితో ముగియలేదు.
అమినీ మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇరాన్లో మహిళల హక్కుల గురించి చర్చ జరిగింది. ఆ దేశ పాలకులపై అంతర్జాతీయ విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కొన్ని సంవత్సరాలకే పరస్తూ అహ్మదీ విషయంలో మళ్లీ అదే నిర్బంధం, అదే తరహా శిక్ష, అదే అసహనం కనిపిస్తున్నాయి. చరిత్రలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన పాలకులు, ఆ చరిత్రనే మళ్లీ పునరావృతం చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఇక మతాధికార వ్యవస్థల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు ఉన్న పరిమితులను, మహిళలపై కొనసాగుతున్న వివక్షను, భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను మరోసారి గుర్తుచేస్తుంది.
ఒక మహిళ తన గొంతుతో పాట పాడే హక్కు కోసం కూడా శిక్షను ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు, ఆ సమాజం తన స్వేచ్ఛ గురించి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంస్కృతి, సంప్రదాయం పేరుతో మనుషుల స్వేచ్ఛను సంకెళ్లలో బంధించే ప్రతి వ్యవస్థా చివరకు తన మానవత్వాన్నే కోల్పోతుంది. ఎందుకంటే ఏ విశ్వాసమైనా మనిషి గౌరవం, మనిషి బతుకు కంటే గొప్పది కాదు కదా.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
-
Kavitha: ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వద్దు.. కొవ్వూరులో కవిత వ్యాఖ్యలు
-
Satvika Veeravalli: ‘RC 17’ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
-
Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్‌పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
-
Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..