Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలంటే విద్యార్థులకు గుర్తొచ్చేవి అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు మాత్రమే. ఉపాధి కోసం వెళ్లే నిపుణులకు కూడా ఇవే మొదటి ఆప్షన్లు. కానీ ఇప్పుడు వలసల ట్రెండ్ పూర్తిగా మారిపోతోంది. మనవాళ్ల చూపు యూరప్ దేశాల వైపు మళ్లింది. జర్మనీ, పోలాండ్, రొమేనియా, గ్రీస్ లాంటి దేశాలకు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు.. తక్కువ ఖర్చుతో కూడిన విద్య కోసం ఈ కొత్త డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. విదేశీ వలసల్లో వస్తున్న ఈ సరికొత్త మార్పుల వెనుక ఉన్న కారణాలేంటో తెలుసా…?.
పదేళ్ల క్రితం వరకు విదేశీ ప్రయాణం అంటే అమెరికా, యూకేలే ప్రధాన గమ్యస్థానాలు. కానీ తాజా లెక్కలు గమనిస్తే వలసల చిత్రం ఆశ్చర్యకరంగా మారిపోయింది. రష్యా, రొమేనియా, గ్రీస్, పోలాండ్ లాంటి దేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాత గణాంకాలతో తాజా లెక్కలను పోల్చి చూస్తే ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రొమేనియాలో భారతీయుల సంఖ్య ఏకంగా 205 శాతం పెరగడం విశేషం. రష్యాలో 166 శాతం వృద్ధి నమోదు కాగా గ్రీస్‌లో 162 శాతం పెరిగింది. పోలాండ్ లో 121 శాతం… జర్మనీలో 41 శాతం మేర భారతీయుల వలసలు పెరిగాయి. ఐరోపా సమాఖ్యలో కూడా భారతీయులకు నివాస అనుమతులు మునుపటి కంటే 18.4 శాతం మేర పెరిగాయి.
Also Read
- India's First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
- Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఉద్యోగ నిపుణులు యూరప్ వైపు చూడటానికి ప్రధాన కారణం అక్కడ నెలకొన్న లేబర్ డిమాండ్. చాలా యూరోపియన్ దేశాల్లో వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోతోంది. దీని వల్ల అక్కడ యువత సంఖ్య తగ్గి తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో వీసా, వర్క్ పర్మిట్ నిబంధనలు కఠినంగా మారుతున్నాయి. జర్మనీ, పోలాండ్, పోర్చుగల్, ఇటలీ లాంటి దేశాలు విదేశీ వర్కర్ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉన్న నిపుణులకు అక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
విద్యార్థుల ఆలోచనా విధానంలో కూడా చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమెరికా, యూకే, కెనడా లాంటి దేశాల్లో నిరంతరం వెంటాడుతున్న వీసా అనిశ్చితి విద్యార్థులను కలవరపెడుతోంది. అక్కడ రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, కఠినమైన అడ్మిషన్ ప్రక్రియల వల్ల ప్రత్యామ్నాయ దేశాల వైపు అడుగులు వేస్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు విద్యార్థుల దరఖాస్తులు గత మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. చదువు పూర్తయిన తర్వాత దీర్ఘకాలంలో అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా విద్యార్థుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గ రాబడి కచ్చితంగా ఎక్కడ ఉంటే ఆ దేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎంచుకునే కోర్సుల్లో కూడా సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఎంతో క్రేజ్ ఉన్న సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు ఇప్పుడు డిమాండ్ తగ్గుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి 24 శాతం నుంచి 17 శాతానికి పడిపోయింది. అదే సమయంలో బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. మెడిసిన్ కోర్సులకు డిమాండ్ ఏకంగా 4 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో ఉపాధికి ఢోకా లేని హెల్త్‌కేర్ వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టామ్‌కామ్ లాంటి సంస్థలు నర్సులకు జర్మన్, జపనీస్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.
అనేక ఆంక్షలు పెట్టి… వలసవాదులను అవమానించి.. వీసా ఆంక్షలు విధించి అమెరికా మనవాళ్లను వెళ్లగొడుతుంటే… చాలా యూరోపియన్ దేశాలు మాత్రం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నాయి.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..