Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిశ్శబ్ద ప్రపంచం! కానీ, ఇప్పుడు అక్కడ ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం మొదలైంది. చారిత్రాత్మక విజయాలతో అంతరిక్షంలో మన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నుంచి ఒక పిలుపు వచ్చింది! “రండి, చంద్రుడిపై మనం కలిసి మానవ నివాసాన్ని నిర్మిద్దాం” అని నాసా కోరింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సైన్స్ ఒప్పందం మాత్రమే కాదు… చైనా-రష్యాల కూటమి విసురుతున్న సవాలుకు, అమెరికా నేతృత్వంలోని కూటమి ఇస్తున్న అతిపెద్ద వ్యూహాత్మక సమాధానం! మరి ఈ విశ్వ వేదికపై భారత్ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? నాసాకు ఇస్రో ఎందుకు అంత కీలకంగా మారింది? ఈ మహా పోరులో చైనా ఎక్కడ ఉంది..?
ఆగస్టు 5, 6 తేదీల్లో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరిగింది. భారత్-అమెరికా మధ్య జరిగిన ఈ ‘సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్’ 9వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలోనే నాసా తన అత్యంత ప్రతిష్టాత్మక ‘మూన్ బేస్’ ప్రాజెక్టులో భాగస్వామి కావాల్సిందిగా ఇస్రోను అధికారికంగా ఆహ్వానించింది. చంద్రుని అన్వేషణ, మానవ వ్యోమగామ యాత్రలు, వాణిజ్య అంతరిక్ష కార్యకలాపాలు, ఆర్టెమిస్ ఒప్పందం కింద సైంటిఫిక్ డేటా షేరింగ్ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. మార్చి 2026లో నాసా తన ‘ఇగ్నిషన్’లో భాగంగా ఈ మూన్ బేస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. గతంలో జరిగిన అపోలో మిషన్లలా కేవలం జెండా పాతడం కోసమే కాకుండా, రీసెర్చ్ స్టేషన్లను నిర్మించి, సుదీర్ఘకాలం పాటు వ్యోమగాములు చంద్రుడిపై నివసించేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
నాసా-ఇస్రో భాగస్వామ్యానికి ప్రధాన కేంద్రబిందువు చంద్రుని దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువంలోని అత్యంత చీకటిగా ఉండే కుహరాలలో వేల సంవత్సరాలుగా మంచు రూపంలో నీరు ఉంది. ఈ నీటిని సేకరించి తాగునీటిగా, శ్వాసించే ఆక్సిజన్‌గా, అలాగే భవిష్యత్తు స్పేస్ క్రాఫ్ట్‌లకు కావలసిన హైడ్రోజన్-ఆక్సిజన్ రాకెట్ ఇంధనంగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా, అక్కడి ఎత్తైన ప్రాంతాలలో నిరంతరం సూర్యకాంతి లభిస్తుంది కాబట్టి సోలార్ ఎనర్జీ తయారీకి ఇది అత్యంత అనుకూలం. ఇక్కడే భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. 2023లోనే ‘చంద్రయాన్-3’ ద్వారా దక్షిణ ధ్రువానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన చరిత్ర ఇండియాకు ఉంది. ఈ ఘనత సాధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. అక్కడి వాతావరణంపై ఇస్రో సేకరించిన ప్రాక్టికల్ డేటా నాసాకు చాలా కీలకం.
Also Read
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
- Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
- Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
అమెరికా దృష్టిలో ఇస్రో కేవలం ఒక సాధారణ భాగస్వామి కాదు; అత్యంత తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించే ‘కాస్ట్-ఎఫెక్టివ్’ టెక్నాలజీ దిగ్గజం. నాసా ప్రాజెక్టులు భారీ బడ్జెట్లతో కూడుకున్నవి. కానీ ఇస్రో మాత్రం అత్యంత తక్కువ ఖర్చుతోనే స్పేస్ లో వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇస్రో ఇంజనీరింగ్, స్పేస్ పేలోడ్స్, సైంటిఫిక్ పరికరాలు, రోబోటిక్ నెవిగేషన్ టెక్నాలజీ నాసాకు అదనపు బలాన్నిస్తాయి. ఇంతకుముందే భూ ఉపరితలాన్ని పర్యవేక్షించే నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ప్రాజెక్ట్ ద్వారా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దీనికి తోడు, భారత్ ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానంతో ‘గగన్‌యాన్’ ద్వారా మానవ రహిత, మానవ సహిత రోదసి యాత్రలను వేగవంతం చేస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో నాసా-ఇస్రో ఉమ్మడి ఆస్ట్రోనాట్ మిషన్లకు, లోతైన అంతరిక్ష పరిశోధనలకు బలమైన పునాది వేస్తోంది.
మరోవైపు, ఈ అంతరిక్ష రేస్ వెనుక చైనా రూపంలో అతిపెద్ద జియో పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉంది. చైనా తన అంతరిక్ష ఆకాంక్షలను అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 2026 ద్వితీయార్థంలో చైనా పంపుతున్న ‘చాంగ్-ఇ 7’ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంలోని వనరులను, వాతావరణాన్ని క్షుణ్ణంగా సర్వే చేయడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా, 2030 నాటికి తన వ్యోమగాములను చంద్రుడిపై దించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి పోటీగా రష్యాతో చేయి కలిపి ‘ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్’-ILRS పేరుతో ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఇతర దేశాలను కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
అంతరిక్ష ప్రపంచం ఇప్పుడు రెండు స్పష్టమైన ధ్రువాలుగా విడిపోతోంది. ఒకవైపు నాసా నేతృత్వంలోని ‘ఆర్టెమిస్’ కూటమి, మూన్ బేస్ ప్రోగ్రామ్ కాగా, మరొకవైపు చైనా-రష్యాల ‘ILRS’ కూటమి. మూడో ప్రపంచ దేశాలకు ప్రతినిధిగా, ఇండిపెండెంట్ స్పేస్ పవర్ ఉన్న ఏకైక గ్లోబల్ సౌత్ దేశంగా భారత్ ఇక్కడ అత్యంత నిర్ణయాత్మక శక్తిగా మారింది. 2023లోనే ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన భారత్, చైనా కూటమిలోకి వెళ్లకుండా నాసాతో చేతులు కలపడం వల్ల గ్లోబల్ స్పేస్ రూల్స్, లూనార్ ఎకానమీ చట్టాలను రూపొందించే అగ్రతాంబూలం భారత్‌కు దక్కుతుంది. చైనా విసురుతున్న సవాలును తిప్పికొట్టడానికి అమెరికాకు భారత్ లాంటి విశ్వసనీయ స్పేస్ పవర్ మద్దతు ఎంతో అవసరం.
నాసా-ఇస్రోల మధ్య బంధం కేవలం సాంకేతిక మార్పిడి మాత్రమే కాదు… రాబోయే శతాబ్దంలో చంద్రుడిపై ఏర్పడే కొత్త ఆర్థిక వ్యవస్థను, అంతరిక్ష ఆధిపత్యాన్ని శాసించే మహా వ్యూహం! నాసా ఇచ్చిన ఈ ఆహ్వానం ఇస్రోను ఒక సాధారణ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్థాయి నుంచి, గ్లోబల్ స్పేస్ లీడర్‌గా నిలబెడుతోంది. చంద్రయాన్ ద్వారా చంద్రుడిని తాకిన భారత్, ఇప్పుడు అమెరికాతో కలిసి చంద్రుడిపై మానవ సామ్రాజ్య నిర్మాణంలో కీలక భాగస్వామిగా మారబోతోంది. విశ్వ వేదికపై భారత్ వేస్తున్న ఈ అడుగులు, రాబోయే తరాల అంతరిక్ష చరిత్రను తిరగరాయడం ఖాయం!
:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!