Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఐదు రూపాయలకు దొరికిన కోడిగుడ్డు ఇప్పుడు తొమ్మిది రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో గుడ్డు ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర 9రూపాయల వరకు పలుకుతోంది. అంటే డజను గుడ్లు కొనాలంటే 108 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
అయితే రానున్న వారాల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గుడ్డు ధర ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి సమాధానం వెతకాలంటే ముందుగా కోళ్ల దాణా మార్కెట్‌ను పరిశీలించాలి.
Also Read
- Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
- UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
- El Nino: ఎల్‌నినో దెబ్బ.. చుట్టుముడుతున్న వ్యాధులు..WHO సంచలన ప్రకటన!
- Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు ఇచ్చే ఆహారంలో మొక్కజొన్న, సోయాబీన్, ఇతర ధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది కిలో మొక్కజొన్న ధర సుమారు 18రూపాయలు ఉండగా ఇప్పుడు 34రూపాయలకు చేరింది. బ్రోకెన్ రైస్ ధర కూడా కిలో 14 రూపాయల నుంచి 32రూపాయలకు పెరిగింది.
ఈ పెరుగుదలకు వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ప్రధాన కారణాలు. ముఖ్యంగా మొక్కజొన్న వినియోగంలో ఇథనాల్ పరిశ్రమ ప్రభావం పెరుగుతోంది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీకి మొక్కజొన్నను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు అందుబాటులో ఉండే మొక్కజొన్నపై డిమాండ్ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మొక్కజొన్న పండించే రాష్ట్రాల్లో వర్షపాతం లోటు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ మొక్కజొన్న ఉత్పత్తి 15 నుంచి 16 శాతం తగ్గవచ్చని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి.
దీనికి తోడు మార్కెట్లో ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాలతో కొంతమంది వ్యాపారులు నిల్వలు ఉంచుకోవడం కూడా సరఫరాపై ఒత్తిడి పెంచుతోంది. దీని ప్రభావం నేరుగా కోళ్ల పెంపకంపై పడుతోంది. దాణా ఖర్చులు పెరిగితే ఒక్కో గుడ్డును ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం కూడా పెరుగుతుంది. రైతులు ఆ భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కాకపోవడంతో గుడ్ల అమ్మకపు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక రెండో అంశం డిమాండ్. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలలు పౌల్ట్రీ పరిశ్రమకు అత్యధిక వినియోగం ఉండే కాలం. చలికాలంతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, బేకరీ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల గుడ్లకు డిమాండ్ ఎక్కువవుతుంది. ఇక్కడ మరో కీలకమైన పరిణామం కూడా ఉంది. ఉత్పత్తి ఖర్చులు భరించలేక కొంతమంది రైతులు కోళ్ల పెంపకంలో మార్పులు చేయడం, ముందుగానే కోళ్లను విక్రయించడం వల్ల రాబోయే నెలల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ పరిణామాలు చూస్తే డిసెంబర్ నాటికి గుడ్లు, చికెన్ ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే ఇది ఒక పరిశ్రమ అంచనా మాత్రమే. మొత్తానికి గుడ్డు ధరల పెరుగుదల వెనుక కేవలం చలికాలపు డిమాండ్ మాత్రమే లేదని అర్థమవుతుంది. వ్యవసాయ దిగుబడులు, ఇథనాల్ తయారీకి పెరిగిన మొక్కజొన్న వినియోగం, దాణా ధరలు, పౌల్ట్రీ రైతుల ఉత్పత్తి వ్యయాలు.. ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
-
Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!