Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 10రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. అంటే ప్రపంచానికి ఇంధన ఖర్చుల విషయంలో మరోసారి గట్టి హెచ్చరిక మొదలైనట్టే. మరి ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుంది?
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? విమాన టికెట్ల ధరలు పెరుగుతాయా? మనం కొనుక్కునే కూరగాయలు, నిత్యావసరాలపై కూడా ఈ ప్రభావం పడుతుందా? అసలు క్రూడ్ ఆయిల్ 100 డాలర్ల దగ్గర ఎక్కువకాలం ఉంటే మన ఇంటి బడ్జెట్ పరిస్థితి ఏంటి?
Also Read
ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. భారత్‌కు అవసరమైన ముడి చమురులో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుంచే వస్తుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరిగితే భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించి అదే చమురును కొనాలి.
ఈసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్ ఒక్కసారిగా పెరగడం కాదు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన సరఫరా ఆందోళనలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే క్రూడ్ 100 డాలర్లు దాటిందంటే మరుసటి రోజే పెట్రోల్ బంక్‌లో ధర పెరిగిపోతుందని అర్థం కాదు. భారత్‌లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంతకాలం అంతర్జాతీయ ధరల మార్పులను తమ మార్జిన్లలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే క్రూడ్ ధరల్లో ఇంతటి కదలిక వచ్చినా దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే అదే స్థాయిలో మారాల్సిన పరిస్థితి ఉండదు. కానీ అసలు సమస్య ధర ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే మొదలవుతుంది. భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించి చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తే దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు పెరుగుతుంది. దీనివల్ల రూపాయిపై ఒత్తిడి రావచ్చు. రూపాయి బలహీనపడితే చమురును దిగుమతి చేసుకోవడం మరింత ఖరీదవుతుంది.
ఇలా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత దీని ప్రభావం రవాణా ఖర్చులపై కనిపిస్తుంది. డీజిల్ ధర పెరిగితే ట్రక్కులు, బస్సులు, ఇతర వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.
సరుకులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చు చివరికి వస్తువుల ధరల్లోకి చేరుతుంది. మనం మార్కెట్లో కొనుక్కునే కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల ధరలపై కూడా పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. విమాన ప్రయాణికులపైనా ప్రభావం ఉండొచ్చు. విమానయాన సంస్థలకు ఇంధనమే అతిపెద్ద నిర్వహణ ఖర్చుల్లో ఒకటి. విమాన ఇంధనం ధర ఎక్కువకాలం పెరిగితే ఆ భారంలో కొంత భాగం టికెట్ ధరల ద్వారా ప్రయాణికులపై పడే అవకాశం ఉంటుంది. ఇదంతా కలిపి చూస్తే క్రూడ్ ఆయిల్ కథ పెట్రోల్ బంక్ దగ్గర మొదలై అక్కడే ముగిసేది కాదని అర్థమవుతుంది.
అది రూపాయి విలువను తాకొచ్చు, దిగుమతి బిల్లును పెంచొచ్చు, రవాణా ఖర్చులను పెంచొచ్చు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ప్రస్తుతం అత్యంత కీలకమైన ప్రశ్న ఒక్కటే. 100 డాలర్లను దాటిందా లేదా అనేది కాదు. ఈ ధరలు ఇంకా ఎన్ని రోజులు 100 డాలర్ల పైనే కొనసాగుతాయన్నదే భారత్‌కు అసలు పరీక్ష.
తాజావార్తలు
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
ట్రెండింగ్
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!