Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది.
ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ వారి పేరే మెసేజీలో కనిపిస్తుందేమో అనిపిస్తుంది.
నెమ్మదిగా ఒక మనిషి మన రోజులోకి వస్తాడు. ఆ తర్వాత మన రోజులో ఒక భాగంగా మారిపోతాడు. ఇక్కడి వరకు ప్రేమ చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రతి అందమైన విషయం జీవితాంతం మనతోనే ఉండాలని లేదు. కొంతకాలం గడిచాక అదే సంబంధం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో కనిపించడం మొదలవుతుంది. మాటల్లో ఉన్న ప్రేమకు, జీవితంలో కలిసి నడవగలగడానికి మధ్య ఎంత దూరం ఉంటుందో అర్థమవుతుంది.
Also Read
- Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
- Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
- America Vs Iran: డెడ్‌లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
ఒకరిని ఎంతగా ప్రేమించినా, వాళ్లతో కలిసి జీవించడం మనకు సాధ్యపడకపోవచ్చు. అప్పుడు ఒక విచిత్రమైన నిజం మన ముందు నిలబడుతుంది. ప్రేమతో మొదలైన సంబంధాలను..ద్వేషంతో ముగించాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు ప్రేమ ఉన్నప్పుడే ముగుస్తాయి. ఎందుకంటే ప్రేమ ఒక్కటే జీవితాన్ని నిలబెట్టదు. నమ్మకం కావాలి. గౌరవం కావాలి. మనశ్శాంతి కావాలి. ఇద్దరి జీవితాలు ఒకదానితో ఒకటి నడవగలగాలి. ఇవన్నీ లేకపోతే ప్రేమ ఉన్నా సంబంధం లోపల ఖాళీ పెరుగుతుంది. అది అర్థమైనప్పుడు మెదడు ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్లాలి అని మెదడు చెబుతుంది. కానీ మనసు? అది అంత త్వరగా మూవ్ ఆన్ అవ్వదు. ఒక ఉదయం కూర్చుని నిర్ణయం తీసుకున్నంత మాత్రాన, ఎన్నో సంవత్సరాల అనుబంధం అదే రోజు మాయమవదు.
ఎందుకంటే సంబంధం ముగిసిందనే విషయం మనసుకు చెప్పడం ఒక పని. ఆ సంబంధం లేకుండా జీవించడం నేర్పడం మరో పని. ఇదే అత్యంత కష్టమైన పని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సైకాలజీ చెబుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు మనం కేవలం ఒక మనిషితో అనుబంధం ఏర్పరుచుకోం.
ఆ మనిషితో కలిసి మన రోజువారీ జీవితం, స్నేహాలు, అలవాట్లు, ఇష్టాలు, భవిష్యత్తు ఊహలు కూడా కొంతవరకు కలిసిపోతాయి. ఈ విషయాన్ని ఎరికా స్లాటర్, వెండి గార్డ్నర్, ఎలి ఫింకెల్ చేసిన 2010 పరిశోధనలో నేరుగా పరిశీలించారు. ప్రేమ సంబంధం ముగిసిన తర్వాత ‘నేను ఎవరు?’ అనే స్వీయ భావనలో మార్పు వస్తుందా అనే ప్రశ్నపై మూడు అధ్యయనాలు చేశారు. సంబంధం ముగిసిన తర్వాత వ్యక్తులు తమ గురించి కలిగి ఉన్న భావనలో మార్పులు రావడం, తమను తాము స్పష్టంగా అనుభూతి చెందే స్థాయి తగ్గడం కనిపించింది.
2021లో ప్రచురితమైన ఓ బ్రేకప్ రిలేటెడ్ పరిశోధనలో 87 మందిని 30 వారాల పాటు పరిశీలించారు. అందరిలోనూ బాధ ఒకే విధంగా కొనసాగలేదు. కొందరు త్వరగా కోలుకున్నారు, కొందరు నెమ్మదిగా కోలుకున్నారు, మరికొందరిలో బాధ ఎక్కువకాలం కొనసాగింది. అదే విషయాన్ని పదే పదే ఆలోచించే స్వభావం ఎక్కువగా ఉన్నవారిలో నెమ్మదిగా కోలుకోవడం లేదా ఎక్కువకాలం బాధ కొనసాగడం ఎక్కువగా కనిపించింది. అందుకే అసలు సమస్య మన ఆలోచనలే అవుతాయి.
ఒక మనిషి గురించి ఆలోచించడం మొదలుపెడతాం. ఆ తర్వాత ఎందుకు ఇంకా మర్చిపోలేకపోతున్నానని బాధపడతాం. ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ వాళ్ల గురించే ఆలోచిస్తాం. అలా ఒక లూప్ తయారవుతుంది.
రోజులు గడుస్తాయి. పని ముందుంటుంది. కలలు ముందున్నాయి. మనలో ప్రతిభ ఉంటుంది కానీ మనసు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. అక్కడే మనం ఆగి ఒక ప్రశ్న అడగాలి. మనకు వాళ్లు కావాలా? లేదా వారితో ఉన్నప్పుడు మనకు కలిగిన ఆ అనుభూతి కావాలా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు ఒకటే కావాల్సిన అవసరం లేదు. అందుకే ప్రేమను వదిలిపెట్టడం అంటే ఆ ప్రేమ అబద్ధమని చెప్పడం కాదు. అది నిజమే. ఆ రోజులు నిజమే. ఆ సంతోషం నిజమే. ఆ అనుబంధం కూడా నిజమే. కానీ నిజమైన ప్రతి విషయం మన జీవితాంతం మనతో ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని మనుషులు మన జీవితాన్ని మార్చడానికి వస్తారు. మనతో జీవితాంతం ఉండడానికి మాత్రం రారు. అది అంగీకరించిన రోజే మనసు మెల్లగా తన దృష్టిని మార్చుకుంటుంది. ఇంతకాలం వాళ్లు ఏం చేస్తున్నారో చూసిన మనసు… ఇప్పుడు నేను ఏం చేయాలని అడగడం మొదలుపెడుతుంది.
ఇంతకాలం వాళ్లు తిరిగి వస్తారా అని ఎదురుచూసిన మనసు… ఇప్పుడు నా జీవితం ఎటు వెళ్లాలి అని ఆలోచిస్తుంది. అక్కడినుంచి చిన్న చిన్న విషయాలు తిరిగి వస్తాయి. ఎప్పుడో వదిలేసిన పని.. ఎప్పుడో పక్కన పెట్టిన కల. తనలోనే దాచుకున్న ప్రతిభ. ఎవరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలనిపించే పని. మళ్లీ తన కోసం జీవించాలనిపించే ఉదయం. అది పెద్ద మార్పులా కనిపించదు కానీ అదే అసలు మార్పు.
తాజావార్తలు
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
-
Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!