నిరుద్యోగులకు చెన్నై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 73 టెక్నికల్ అసిస్టెంట్, లేబొరేటరీ అటెండెంట్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం..
టెక్నికల్ అసిస్టెంట్: 60,
లేబొరేటరీ అటెండెంట్ : 13 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..
ఈ ఉద్యోగాల పై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోగలరు.. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ,మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ/క్లినికల్ ఫార్మకాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోమెడికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రికల్, హెల్త్ ఎకనామిక్స్, మెకానిక్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మసీ, సైకాలజీ, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఎక్స్-రే, వెటర్నరీ సైన్స్, లాబొరేటరీ, ప్లంబర్ మొదలగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి..
అర్హతలు..
10వ తరగతితో పాటు సంబధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..
వయోపరిమితి..
అభ్యర్ధుల వయసుకు సంబంధించి లాబొరేటరీ అటెండెంట్: 18-25 సంవత్సరాలు, టెక్నికల్ అసిస్టెంట్: 18-30 సంవత్సరాలు ఉండాలి. అలాగే నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు..
రూ.300. నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది..
ఎంపిక ప్రక్రియ..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది..
జీతం..
టెక్నికల్ అసిస్టెంట్: రూ. 35400 -112400, లాబొరేటరీ అటెండెంట్: రూ. 18000 -56900.వేతనంగా చెల్లిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు చెన్నై & పుదుచ్చేరి ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. నవంబర్ 08 ఆఖరు తేదీ.. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nirt.res.in/ పరిశీలించగలరు..