పవర్ గ్రిడ్ లో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ powergrid.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్ట్‌లో మినిమమ్ మార్క్స్ తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
వయోపరిమితి..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు కనీస వయస్సు 18 సంవత్సరాలు,గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి.. అలాగే కొందరికి వయస్సు లో సడలింపు కూడా ఉంది..
అప్లికేషన్ ఫీజు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు కొన్ని కులాల వారికి ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఇతర అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 500 చెల్లించాలి… ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారు చివరి తేదీ జులై 4. దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు పైన ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ ద్వారా బాగా చదివి అప్లై చేసుకోవాలి..