AP High Court: విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలంటూ ఏపీ హైకోర్టు సీరియస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది. చట్టాన్ని, ఆదేశాలను అమలుచేసినట్లు రుజువులు చూపించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్టీఈ రూల్స్ మేరకు పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
TS SSC Supplementary Result 2022: అలర్ట్.. నేడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఈ కేటగిరీలో ఎంత మందికి అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని, అవి సరిగా లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లు బాధ్యత వహించాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారుల చర్యలు పరోక్షంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఉపయోగపడేలా ఉన్నాయంటూ ఆక్షేపించింది. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికింది. సమర్థతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సూచించింది. తాండవ యోగేష్ అనే అడ్వొకేట్ గతంలో దాఖలుచేసిన ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌పై ఇంతకు ముందే విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది.
ఈ వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ పీకే మిశ్ర, జస్టిస్ డీవీఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం నిన్న మరోసారి విచారణ జరిపింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయిస్తున్నారనే సంగతి చాలా మంది పేరెంట్స్‌కి తెలియదని, అందువల్ల దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని న్యాయవాది చెప్పారు. ఏపీలో మొత్తం 16 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, ఒక్కో స్కూల్లో కనీసం 5 సీట్లను ఆర్టీఈ కింద కేటాయించినా దాదాపు 80 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..