AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది.